Evidence: హిందూ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ ఎంట్రీ, సాక్షాలు, సుమోటో కేసుతో !
బెంగళూరు/శివమొగ్గ: రోడ్డు మీద మొబైల్ లో మాట్లాడుకుంటూ వెలుతున్న హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు సాక్షాలు సేకరిస్తున్నారు. సుమారు 14 మంది అధికారులు కర్ణాటకలోని శివమొగ్గ చేరుకుని హర్షా హత్యకు సంబంధించిన సాక్షాలు సేకరించడంలో నిమగ్నం అయ్యారు.ఇదే సమయంలో నలుగురి మీద పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.
ఇదే సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి శివమొగ్గలో మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెలుతున్న హర్షాను కొందరు వెంబడించి దాడి చేశారు. ప్రాణాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన హర్షాను నడిరోడ్డులో వెంటాడి వెంటాడి నరికి చంపేశారు. హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్యకు గురికావడంతో శివమొగ్గతో పాటు కర్ణాటకలో కలకలం రేపింది.

దేశవ్యాప్తంగా హిందూ కార్యకర్త హర్షా హత్య కేసు దూమరం రేపింది. ఇప్పటికే హర్షా హత్య కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం హర్షా హత్య కేసులో అరెస్టు అయిన 12 మంది వ్యక్తుల ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులు పలువురిని విచారణ చేసి పూర్తి వివరాలు, సమాచారం సేకరించారని తెలిసింది.
ఎన్ఐఏ బెంగళూరు కార్యాలయం ఎస్పీ విక్రమన్ తో పాటు మరో 14 మంది అధికారులు శివమొగ్గలో పలు ప్రాంతాల్లో సంచరించి హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసుకు సంబంధించి సాక్షాలు సేకరించారు. ఇదే సమయంలో హర్షా హత్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారని నలుగురి మీద శివమొగ్గ గ్రామీణ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. హర్షా హత్య కేసుకు సంబంధించి వివరాలు వెళ్లడించడానికి ఎన్ఐఏ అధికారులు నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications