వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ అఫ్గానిస్థాన్‌పై ప్రధాని మోదీ ఫోకస్ -సీసీఎస్ భేటీలో కీలక ఆదేశాలు -కాబూల్ కల్లోలంపై నిరంతర సమీక్ష

|
Google Oneindia TeluguNews

ఇండియాతో సరిహద్దులు పంచుకుంటూ, దక్షిణాసియాలో అనూహ్య మార్పులకు కేంద్ర బిందువుగా ఉంటోన్న అఫ్గానిస్థాన్ వ్యవహారాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోకస్ పెంచారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘని నిష్రమణ, కాబూల్ నూ ఆక్రమించిన తర్వాత తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపు తదితర పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు అత్యున్నత స్థాయి కీలక సమావేశంలో పాల్గొన్నారు..

 తాలిబన్లకు భారీ షాక్: అఫ్గాన్ అధ్యక్షుడు తానేనన్న అమ్రుల్లా సాలే -ఇండియా తీర్చి దిద్దిన నాయకుడు తాలిబన్లకు భారీ షాక్: అఫ్గాన్ అధ్యక్షుడు తానేనన్న అమ్రుల్లా సాలే -ఇండియా తీర్చి దిద్దిన నాయకుడు

అఫ్గాన్ సంక్షోభం నేపథ్యంలో ఇవాళ ప్రధాని అధికారిక నివాసం, 7 లోక కల్యాణ్ మార్గ్ లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించిన ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్ల సహా సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, అఫ్గాన్ లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ పాల్గొన్నారు.

Ensure Safe Evacuation of indians, provide refuge:PM Modi key Meet On Afghan Taliban crisis

అఫ్గాన్ ను ప్రస్తుతం తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి భారతీయులను అత్యవసరంగా మన దేశానికి రప్పించే విషయంలో జాగ్రత్తలు వహించాలని, సహాయం కోసం ఎదురు చూస్తోన్న అఫ్గాన్ సోదరులకు, శరణార్థులుగా భారత్ రావాలనుకునేవారికీ తగిన సహకారం అందించాలని ప్రధాని మోదీ అదేశించారు. ఇప్పటికే భారత్ వచ్చేసిన బృందాలను సురక్షితంగా సొంత స్థలాలకు తరలించాలని సూచించారు. కాగా,

కాబూల్ నుంచి భారతీయులను రప్పించడానికి తీసుకుంటున్న అన్ని చర్యలను ప్రధాని మోదీ సోమవారం రాత్రి వరకు నిరంతరం సమీక్షించారని అధికార వర్గాలు తెలిపాయి. కాబూల్‌లోని ఇండియన్ ఎంబసీ సిబ్బందితో విమానం బయల్దేరే వరకు మోదీ నిరంతరం సమీక్షించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భోజనం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీరు ప్రయాణించిన విమానం జామ్‌నగర్‌లో కాసేపు ఆగి, న్యూఢిల్లీకి మంగళవారం ఉదయం చేరుకుంది.

 తాలిబన్లతో భారత్ చర్చలు -మోదీ విధానమేంటి?: అఫ్గాన్ సంక్షోభంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు తాలిబన్లతో భారత్ చర్చలు -మోదీ విధానమేంటి?: అఫ్గాన్ సంక్షోభంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

అఫ్గానిస్థాన్‌లో కల్లోలం నెలకొన్న కారణంగా ఆ దేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటుచేసింది. అఫ్గాన్ శరణార్థుల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. వీసా నిబంధనలపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేపట్టి వీసా నిబంధనల్లో మార్పులు చేసిందని హోంశాఖ అధికార ప్రతినిధి ట్వీటర్ ద్వారా తెలిపారు. కాగా,

Ensure Safe Evacuation of indians, provide refuge:PM Modi key Meet On Afghan Taliban crisis

తాలిబన్ల చేతిల్లోకి వెళ్లిపోయిన అఫ్గానిస్థాన్ విషయంలో భారత ప్రభుత్వం త్వరితగతిన స్పష్టమైన విధానాలను ప్రకటించాలని, తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా వారితో చర్చలు జరపాలని విపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. తాలిబన్ ఇప్పుడు ఐసిస్, జైషే, లష్కరే లాంటి ఉగ్రమూకలకు స్థావరంగా మారిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మోదీ వేగంగా స్పందించాలని విపక్ష నేతలు కోరుతున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Tuesday chaired a meeting of the Cabinet Committee on Security (CCS) where he instructed all concerned officials to ensure the safe evacuation of Indian nationals from Afghanistan within the next few days and also provide all possible help to “Afghan brothers and sisters who are looking towards India for assistance.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X