ఫలితాలు రాకముందే విందూ వినోదం..! రేపు ఎన్డీయే నేతలకు అమిత్ షా ట్రీట్...!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఫలితాలు వెలువడే ముందు బీజేపి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) నేతలకు మంగళవారం బీజేపీ చీఫ్ అమిత్ షా విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన ఎన్డీయే కీలక నేతలకు ఆహ్వానం పంపినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు రెండు రోజుల పాటు సాయంత్రం వేళ విందు పేరుతో ఆయన సమావేశం కానున్నట్టు చెబుతున్నారు. కేంద్ర క్యాబినెట్ భేటీ కూడా అదే రోజు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ఈ విందు భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

ఎన్డీయే 300 సీట్లుపైగా సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్‌పోల్స్ నిన్న స్పష్టమైన అంచనాలు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని పీఠం అధిష్టించడం ఖాయమంటూ బీజేపీ చెబుతుండగా... ప్రతిపక్షాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తున్నాయి. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకు గానూ ఏప్రిల్ 11 నుంచి ఈ నెల 19 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
More From
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications