వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్‌ కేసు: మాజీ హీరోయిన్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీసు!?

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ మాజీ హీరోయిన్‌ మమతా కులకర్ణిపై రెడ్‌కార్నర్‌ నోటీసు జారీకి రంగం సిద్ధమైంది. మమత ప్రస్తుతం కెన్యాలో ఉండగా, ఆమె సహచరుడు వికీ గోస్వామి అమెరికాలో అండర్ గ్రౌండ్‌లో తలదాచుకున్నట్లు స

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై : డ్రగ్స్ కేసులో బాలీవుడ్ మాజీ హీరోయిన్‌ మమతా కులకర్ణిపై రెడ్‌కార్నర్‌ నోటీసు జారీకి రంగం సిద్ధమైంది. దేశంలో ఇప్పటివరకు వెలుగు చూసిన అతి పెద్ద డ్రగ్స్‌ కుంభకోణం షోలాపూర్‌లో ఎఫిడ్రీన్ పట్టివేతే.

2014లో వెలుగుచూసిన సోలాపూర్‌ ఎఫిడ్రీన్‌ పట్టివేత కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ.2 వేల కోట్ల పైమాటే. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నైజీరియన్లు సహా 14 మందిని అరెస్టు చేశారు.

Ephedrine haul - Red Corner Notice against Mamta Kulkarni soon

కీలక నిందితులైన మమత, గోస్వామిలు సహా నలుగురి కోసం వేట కొనసాగుతోంది. గతంలో డ్రగ్స్‌ సంబంధిత కేసులోనే కెన్యాలో మమతా కులర్ణిని అరెస్టయి, విడుదలయ్యారు.
తన సహచరుడు వికీ గోస్వామితో కలిసి మమతా కులకర్ణి పలుదేశాల్లో డ్రగ్స్‌ దందా నిర్వహించేవారు.

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఏవన్‌ లైఫ్‌సైన్సెస్‌ ఫ్యాక్టరీలో ఎఫిడ్రీన్‌ తయారీ ముఠాతో వారికి నేరుగా సంబంధాలున్నాయని సీఐడీ పక్కా ఆధారాలు సేకరించింది. తాను సంపాదించిన ఆ ఆధారాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సమర్పించింది.

వాటిని అంతర్జాతీయ సంస్థ ఇంటర్‌పోల్‌కు పంపిన సీబీఐ.. మమతపై రెండ్‌ కార్నర్‌ నోటీసు జారీచేయాలని కోరింది. రెండు నెలల కిందటే ఈ తతంగమంతా జరిగినప్పటికీ, చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతో ఈ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడ్డాయి.

ఎఫిడ్రీన్‌ తయారీ కేసుకు సంబంధించి మహారాష్ట్ర సీఐడీ పోలీసులు కొద్దిరోజుల కిందటే(సెప్టెంబర్‌ 29న) చార్జిషీట్‌ దాఖలు చేసి, సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు పంపారు. 'నేడో, రేపో మమతా కులకర్ణిపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది' అని ముంబై పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

మమత ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయిన వారిని ఎయిర్‌పోర్టుల్లో సులువుగా చిక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక మమత సహచరుడు వికీ గోస్వామి అమెరికాలో అండర్ గ్రౌండ్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.

English summary
The Thane police are in the process of getting a Red Corner Notice (RCN) issued against former actress Mamta Kulkarni, wanted accused in the Ephedrine drug bust case. Kulkarni is believed to be holed up in Mombassa, Kenya, and will find it difficult to leave the country once the RCN is issued. According to the police, the process of registering the RCN was delayed because they were required to file a chargesheet against Kulkarni first. The police filed the chargesheet on September 29, and are now preparing a dossier on the actress to submit to the CBI, which has an Interpol wing. The RCN should be issued in another couple of months, police said. An officer said, “Due to certain technical issues, we had to wait before a chargesheet could be filed. That in turn delayed the process of registering an RCN against her. However, now that we have filed the chargesheet, we are working on the dossier and are hoping the entire process should be completed within the next two months.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X