దినకరన్ గూటికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్: సీఎంకే నిద్రలేకుండా చేస్తున్నారు !

టీటీవీ దినకరన్ గూటికి చేరుతున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పగలే సీఎం పళనిసామికి చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలు చినబాబుకు జై అంటున్నారు, ఏం చెయ్యాలో తెలీక పాపం సీఎం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నిద్రపట్టకుండా చేస్తున్నారు. పత్రి రోజూ సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు దోరణితో ఎదురు తిరుగుతుంటే ఏం చెయ్యాలో తెలీక సీఎం ఎడప్పాడి పళనిసామి తల పట్టుకుంటున్నారు.

ఇంత కాలం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఎడప్పాడి పళనిసామితో ఆడుకుంటూ వచ్చారు. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారనే ఆరోపణలపై అరెస్టు అయిన టీటీవీ దినకరన్ తీహార్ జైల్లో నెల రోజులకు పైగా ఉన్నారు.

Erode east MLA Thennarasu has extended his support to Dinakaran

బెయిల్ మీద బయటకు వచ్చిన టీటీవీ దినకరన్ తరువాత తన రూటూ మార్చారు. పార్టీ కార్యకలాపాలకు దినకరన్ ను దూరం పెట్టడంతో ఆయన ఏకంగా సీఎం పళనిసామి మీద తిరుగుబాటు చేసి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని సీఎం పళనిసామికి పగలే చుక్కలు చూపించారు.

దినకరన్ వైపు ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇదే సమయంలో ఈ రోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే తెన్నరసు ఏకంగా టీటీవీ దినకరన్ ను కలుసుకుని అయ్యా మీకే నా మద్దతు అంటూ టీటీవీకి జై కొట్టడంతో ఎడప్పాడి పళనిసామి హడలిపోయారు. ఇప్పుడు ఎడప్పాడి పళనిసామి ఏం స్కెచ్ వేస్తారో అంటూ ఆయన వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+