వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత దేశంలోనే ఎక్కువ కాలం పని చేసిన గవర్నర్ ఎవరు ? ఇది కాంపీటేషన్ కశ్ఛన్ కాదు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ మరో రికార్డ్ సృష్టించారు. మొత్తం భారత దేశంలో ఎక్కువ కాలం గవర్నర్ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ బ్రేక్ చేశారు.

12 సంవత్సరాల 3 నెలల గవర్నర్ జీవితం ...

12 సంవత్సరాల 3 నెలల గవర్నర్ జీవితం ...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా సేవలు అందిస్తున్న ఈఎస్ఎల్ నర్సింహన్ రూటే సపరేటు అయింది. ఆయన్ను గవర్నర్ గా నియమించిన కేంద్ర ప్రభుత్వం మారినా, పదవి బాద్యతలు చేపట్టిన రాష్ట్ర్రం విడిపోయినా ఆయన మాత్రం గవర్నర్ పదవిలో కొనసాగుతునే ఉన్నారు . గవర్నర్ గా నియమించినప్పటి నుండి కేంద్ర రాష్ట్ర్రా ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ వివాదరహితుడిగా కొనసాగుతున్నారు ఇఫ్పుడు అదే ఆయనకు శ్రీరామ రక్ష అయింది, దీంతో భారత దేశ చరిత్రలోనే ఎక్కువ కాలం గవర్నర్ సేవలు అందించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు మన గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్.

జనవరి 25 2007 న చత్తీస్‌గఢ్ గవర్నర్ గా..

జనవరి 25 2007 న చత్తీస్‌గఢ్ గవర్నర్ గా..

ఈఎస్ఎల్ నర్సింహన్ మొదటి సారి గవర్నర్ గా జనవరి 25 2007 లో చత్తీస్‌గఢ్ గవర్నర్ గా పదవి బాద్యతలు చేపట్టాడు,చత్తీస్‌గఢ్ లో సుమారు రెండు సంవత్సరాల పాటు బాద్యతలు నిర్వహించారు.అనంతరం డిశంబర్ 27 ,2009న ఉమ్మడి అంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాద్యతలు చేపట్టారు. అప్పటి నుండి నేటి ఇప్పటివరకు అంటే 9 సంవత్సరాల నాలుగు నెలలు ఒకే చోట గవర్నర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే , అయితే మొత్తం గవర్నర్ పదవి కాలం చూసుకుంటే మాత్రం 12 సంవత్సరాలుగా ఆయన గవర్నర్ పదవిలో ఉన్నారు. ఇది దేశంలోనే అత్యంత ఎక్కువ కాలం గవర్నర్ గా పని చేసిన రికార్డ్

 గతంలో పదకొండు సంవత్సరాల రికార్డు బద్దలు

గతంలో పదకొండు సంవత్సరాల రికార్డు బద్దలు

కాగా గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా, స్వతంత్ర్య సమరయోధురాలు సరోజినినాయుడు కూతురు పద్మజా నాయుడు బెంగాల్ గవర్నర్ గానవంబర్ 3 ,1956 నుండి జూన్ 1, 1967 వరకు అనగా 10 సంవత్సరాల 7నెలలు ఓకే చోట ఉండి పనిచేసిన రికార్డు ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్ర్రాల గవర్నర్ సైతం 9సంవత్సరాల 4 నెలలుగా ఆయన పదవి భాద్యతలు నిర్వహిస్తున్నారు. మరో సంవత్సరం పాటు ఆయన ఇక్కడ పదవిలో ఉంటే ఓకే చోట ఎక్కువ కాలం పనిచేసిన గవర్నర్ గా కూడ రికార్డ్ బద్దలు కొడతారు నర్సింహన్

యూపిఏ ప్రభుత్వం నుండి ఏన్డీఏ వరకు , మారని నర్సింహన్

యూపిఏ ప్రభుత్వం నుండి ఏన్డీఏ వరకు , మారని నర్సింహన్

యూపిఏ హయాంలో నియమించబడ్డ గవర్నర్లను దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం మార్చి వేసింది. గవర్నర్ నర్సింహన్ ను మాత్రం కొనసాగించింది. కాగా యూపిఏ టర్మ్ లొ నియమించిన వారిలోకూడ ఎక్కువ కాలం ఉన్న గవర్నర్ నర్సింహనే ఉన్నారు. కాగా అటు యూపిఏ లో ను ఇటు ఎన్డీఏలోను కొనసాగిన ఘనత ఆయనది, మరోవైపు రెండు రాష్ట్ర్రాలకు ఎక్కువ కాలం గవర్నర్ గా కొనసాగుతున్న వ్యక్తి నర్సింహన్

English summary
Andhra Pradesh and Telangana joint Governor ESL Narasimhan create a new record as the longest-serving governor in the country. In this way, he stood as all India topper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X