జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ.. త్వరలో కమలం గూటికి...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమయింది. ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈటలతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి హుజూరాబాద్ చేరుకున్న తర్వాత తన అనుచరులతో ఈటల భేటీ కానున్నారు. అనంతరం బీజేపీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
ఎమ్మెల్యే పదవితో పాటు, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈటల రాజీనామా చేయబోతున్నారు. ఐదారు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈటల ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ పార్టీ కూడా నిశితంగా గమనిస్తోంది. ఈటల బీజేపీలో చేరిన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇక ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈటల బీజేపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో జేపీ నడ్డాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అతి త్వరలోనే ఈటల బీజేపీలో చేరిపోతున్నట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. తొలుత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. బీజేపీ నేతలతో కూడా విసృత సంప్రదింపులు జరిపారు. మరోవైపు సొంత పార్టీ ఏర్పాటు చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈటల రాజేందర్ మాత్రం.. కమలం గూటికే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications