టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ ? లోక్ సభకు రిపోర్ట్-విపక్షాల రచ్చరచ్చ..
పార్లమెంట్ నైతిక నియమావళిని ఉల్లంఘించి తనకు ఎంపీగా ఇచ్చిన వెబ్ సైట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకుని నోటుకు ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఇవాళ లోక్ సభ బహిష్కరణ వేటు వేయబోతోంది. ఇప్పటికే మహువా మొయిత్రా వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఆమె సభ్యత్వం రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నివేదికను కేంద్రం ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టింది.
మహువా మొయిత్రాకు సంబంధించిన నోటుకు ప్రశ్న కేసుపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ నివేదికను సమర్పించడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. నిరసన వ్యక్తం చేస్తూ లోక్ సభ కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. దీంతో సభ మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడింది. అనంతరం సమావేశమైన తర్వాత కూడా కాంగ్రెస్, టీఎంసీ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ నివేదికపై అధ్యయనం కోసం సమయం కావాలని కోరాయి. అయితే గతంలో యూపీఏ హయాంలో ఓటుకు ప్రశ్నల కేసులో కాంగ్రెస్ పార్టీ.. 10 మంది ఎంపీల్ని ఒక్కరోజులోనే బహిష్కరించిన విషయాన్ని బీజేపీ గుర్తుచేస్తోంది.

మహువా మొయిత్రా నోటుకు ప్రశ్నల వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా దానిని సాధారణ కేసుగా మార్చాలా లేక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అన్నది సీబీఐ పరిశీలిస్తోంది. ఈ లోపే కేంద్రం మహువా మొయిత్రాను లోక్ సభను బహిష్కరించేందుకు వీలుగా ఇవాళ ఎథిక్స్ కమిటీతో రిపోర్టు ఇప్పించింది. దీంతో ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే లోక్ సభ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుంటే మూకుమ్మడి వాకౌట్ కు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.












Click it and Unblock the Notifications