• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముద్రతో ఉపాధి పొందిన వారి వివరాల వెల్లడికి కోడ్ అడ్డంకి .. ఎన్నికల తర్వాతే డేటా

|

న్యూఢిల్లీ : దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా అక్కడక్కడా నిబంధనల ఉల్లంఘన జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అభినందన్ ఫోటో పోస్ట్ చేసిన బీజేపీ ఎంపీ, ఫేస్ బుక్ కు ఈసీ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముద్ర పథకం ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలు బయటపెట్టొద్దని లేబర్ సర్వే వర్గాలు చెప్తున్నాయి.

మసూద్ ను మళ్లీ కాపాడిన చైనా .. ఇంకా చైనా వస్తువులు కొంటారా ?

వివరాల వెల్లడికి నో ..

వివరాల వెల్లడికి నో ..

దేశంలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం మైక్రో యూనిట్ డెవలప్ మెంట్ రీ ఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) పథకం ద్వారా రుణం అందజేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద ఎంత మందికి ప్రయోజనం కలిగిందనే చర్చ తెరపైకి వచ్చింది. నిరుద్యోగుల వివరాలు, అందజేసిన లోన్ కు సంబంధించి సమాచారం తమ వద్ద ఉందని లేబర్ బ్యూరో వెల్లడించింది. కానీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వెల్లడించలేమని స్పష్టంచేసింది.

ఎన్నికల తర్వాతే ...

ఎన్నికల తర్వాతే ...

ముద్ర పథకం ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందారనే అంశాన్ని ఎన్నికల తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నది. నిపుణుల కమిటీ సూచనల మేరకు తాము అభ్యర్థులకు రుణం మంజూరు చేశామని ఈ సందర్బంగా లేబర్ బ్యూరో తెలిపింది. కానీ మోడల్ కోడ్ అమల్లోకి రావడంతో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలు వెల్లడించడం వీలుకాలేదని లేబర్ సర్వే పేర్కొన్నది.

సర్వే చెబుతోన్న వాస్తవాలు

సర్వే చెబుతోన్న వాస్తవాలు

ఇటీవల ఆరో వార్షికోత్సవం సందర్భంగా దేశంలో ఉద్యోగులు-నిరుద్యోగుల వివరాలతో కూడిన సర్వే వివరాలును లేబర్ సర్వే తెలియజేసింది. నాలుగేళ్ల క్రితం నిరుద్యోగ శాతం 3.9 ఉంటే అది 2017-2018 కి 6.1 చేరిందని పేర్కొంది. ఇది 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని పేర్కొంది. దీంతోపాటు ఉద్యోగ వివరాలను వెల్లడించాలని నీతి ఆయోగ్ .. లేబర్ సర్వేను ఆదేశించింది. ఫిబ్రవరి 27 లోపు జాబితాను ప్రకటించాలని .. అలా అయితే ఎన్నికల కోడ్ కన్నా ముందే డేటా వెల్లడొంచొచ్చని తెలిపింది. కానీ తమ ఉద్యోగ వివరాల ప్రక్రియ కూడా పూర్తవకపోవడంతో ఆ సమాచారాన్ని అందించలేకపోయింది.

ఇదీ అంచనా ..

ఇదీ అంచనా ..

దాదాపు 97 వేల మంది లబ్ధిదారుల వివరాలను లేబర్ సర్వే సేకరించింది. 2015 ఏప్రిల్ 8 నుంచి 2019 జనవరి 31 వరకు వీరంతా ముద్ర పథకం ద్వారా ప్రయోజనం పొందారని అంచనా వేసింది. వీరందరికీ రూ.10.35 కోట్ల నుంచి రూ.15.56 కోట్ల వరకు రుణం మంజూరు చేసి ఉంటారని లెక్కగట్టింది. కానీ ఈ ప్రక్రియకు తుది మెరుగులు దిద్దాల్సి ఉందని లేబర్ సర్వే వర్గాలు పేర్కొన్నాయి. అయితే కార్మికశాఖ మాత్రం ఈ వివరాలు వెల్లడించొద్దని లేబర్ బ్యూరోకు స్పష్టంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. లబ్ధిదారుల్లో రెండు, మూడు లోన్లు తీసుకున్న వారు కూడా ఉండి ఉంటారని బ్యూరో అనుమానం వ్యక్తం చేసింది. 34.26 కోట్ల ఖాతాల్లో ఎక్కువసార్లు రుణం కోసం దరఖాస్తు చేసి ఉంటారని పేర్కొంది.

లోన్లవారీగా క్యాటగిరీలు

లోన్లవారీగా క్యాటగిరీలు

ముద్ర లోన్లలో 90 శాతం రూ.50 వేల వరకు తీసుకున్నారని ఆర్థికశాఖ గత ఆగస్టులో పేర్కొంది. మొత్తం 13.5 కోట్ల రుణాన్ని ఆగస్ట్ 8 వరకు మంజూరు చేశారని గుర్తచేసింది. రూ.50 వేలు అంతకన్నా తక్కువ ఉన్న రుణాన్ని శిశు లోన్ అని పిలుస్తారని వెల్లడించింది. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు 1.4 కోట్ల రుణం అందజేశారని .. వీరిని కిశోర్ లోన్ క్యాటగిరీ .. 5 లక్షల రుణం రూ.19.6 లక్షలు అందజేశారని ... వీరిని తరుణ్ క్యాటగిరీగా పిలుస్తారని తెలిపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Labour Bureau’s survey on the number of jobs created under the Micro Units Development & Refinance Agency (Mudra) scheme will not be made public for another two months making this the third report on employment to be kept under wraps before the elections. “The number of jobs created under the Mudra scheme will be released after the polls as the Expert Committee found anomalies in the methodology used by the Bureau in arriving at the findings,” sources said. On February 22, The Indian Express had reported that the NDA government, after junking the National Sample Survey Office (NSSO) report on unemployment, planned to use findings of the Labour Bureau’s survey.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more