నా భర్త వజ్రం, నా మరిదిని ఓడించి నన్ను గెలిపించండి, గాలి జనార్దన్ రెడ్డి భార్య !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బహిరంగ ప్రచారానికి కొన్ని గంటల మాత్రమే సమయం ఉంది. బళ్లారిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తన భర్త గాలి జనార్దన్ రెడ్డి వజ్రం లాంటివాడని, ఇక్కడి ప్రజలకు ఎంతో సేవ చేశాడని, అందుకే ఆయన భార్యగా అడుగుతున్నాను, అసెంబ్లీ ఎన్నికల్లో తన మరిదిని ఓడించి తనను గెలిపించాలని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ మనవి చేశారు.
సోమవారం సాయంత్రం 6 గంటల తరువాత ఎవరైన బహిరంగ ప్రచారం చేస్తే కేసులు పెట్టడానికి ఎన్నికల అధికారులు సిద్దం అయ్యారు. బళ్లారిలో బీజేపీ తరపున గాలి జనార్దన్ రెడ్డి తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ నుంచి ఫుట్ బాల్ సింబల్ మీద బళ్లారి సిటీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

బళ్లారిలోని హావంభవి ఏరియాలో గాలి జనార్దన్ రెడ్డి హెలిప్యాడ్ లో ఏర్పాటు చేసిన కేఆర్ పీ పార్టీ సమావేశంలో గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ కేఆర్ పీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తన భర్త గాలి జనార్దన్ రెడ్డి వజ్రం లాంటి వాడు, ఆయన ఎవరినైతే పెంచిపోషించారో వాళ్లే ఈ రోజు నా భర్తను ముంచేశారని గాలి లక్ష్మీ అరుణ ఆరోపించారు.
నా భర్త గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్న నాలుగు సంవత్సరాలు మా ఇంట్లో ఒక్క పండుగ కూడా చెయ్యలేదని, ఆ రోజు మేము కష్టాల్లో ఉన్న సమయంలో మమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేదని, నా భర్త అభిమానులే మాకు అండగా ఉన్నారని, ఈ రోజు కూడా వాళ్లే మమ్మల్ని ఆదరిస్తున్నారని గాలి లక్ష్మీ అరుణ చెప్పారు.

భగవంతుడు మాకు అన్ని ఇచ్చాడు. అయితే నా భర్త గాలి జనార్దన్ రెడ్డి నమ్ముకున్న అందరూ ఈ రోజు మాకు దూరం అయ్యారని గాలి లక్ష్మీ అరుణ విచారం వ్యక్తం చేశారు. మా కుటుంబానికి రాజకీయంగా ఓ వ్యతిరేక వర్గం తయారు అయ్యింది. మమ్మల్ని ఇబ్బందులకు గురి చెయ్యడానికి ఆ వర్గం ప్రయత్నిస్తున్నదని గాలి లక్ష్మీ అరుణ ఆరోపించారు.
తాను బళ్లారి నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయిన సమయంలో తన మరిది గాలి సోమశేఖర్ రెడ్డికి సన్నిహితుడు ఒకరు తన దగ్గరకు వచ్చి మీరు బళ్లారి సిటీ నుంచి పోటీ చెయ్యకూడదని, దేవరహిప్పరగి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని చెప్పారని, తన భర్త గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారి నుంచి దూరం చేసినట్లు తనను బళ్లారికి దూరం చెయ్యడానికి ప్రయత్నించారని గాలి లక్ష్మీ అరుణ ఆరోపించారు.
నేను నా మరిది సోమశేఖర్ రెడ్డి మీద పోటీ చేస్తున్నా, గతంలో నా భర్త గాలి జనార్దన్ రెడ్డిని ఆదరించినట్లే ఇప్పుడు తనను ఆదరించి తనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, తన మరిది గాలి సోమశేఖర్ రెడ్డిని ఓడించాలని పరోక్షంగా గాలి లక్ష్మీ అరుణ బళ్లారి నగర ప్రజలకు మనవి చేశారు. ఈ సమావేశంలో బళ్లారి మాజీ మేయర్ వెంకటరమణ, గోనాళ రాజశేఖర్ గౌడ, మున్నాబాయ్, అంజని, హంపి రమణ తదితరులు పాల్గొన్నారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications