సమాజ్ వాదీ పార్టీలో సమసిన సంక్షోభం...రాజీ కొచ్చిన రెండు గ్రూపులు
లక్నో :సమాజ్ వాదీ పార్టీలో సమస్యలు ఏవీ లేవని....అంతా సవ్యంగానే ఉందన్నారు సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ చీఫ్ శివలాల్ యాదవ్ చెప్పారు.తన సోదరుడు పార్టీ చీప్ ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పారు.
పార్టీలో రెండు మూడు రోజులుగా చోటుచేసుకొన్న పరిణామాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై ఆయన అన్ని సానుకూలంగానే ఉన్నాయన్నారు.సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లు పరోక్ష విమర్శలు చేసుకొన్నారు.

పార్టీ సమావేశం ముగిసిన తర్వాత రెండు వర్గాలు రాజీకి వచ్చినట్టు సమాచారం.ఈ మేరకు శివపాల్ తో పాటు మరో నలుగురిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు అఖిలేష్ ఒప్పుకొన్నారు.
రెండు గ్రూపుల మద్య ములాయం రాజీ ఫార్మూల కుదర్చడంతో పార్టీలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికంగా సమసిపోయిందని చెప్పవచ్చును.పార్టీలో నెలకొన్న సమస్యలపై మీడియా ప్రశ్నలకు అన్ని సమసిపోయాయని చెప్పారు శివపాల్ యాదవ్.












Click it and Unblock the Notifications