వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు కాంగ్రెస్ ఎంపీని ఖాళీ చేయించారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గడువు పూర్తయినా ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీని మంగళవారం బలవంతంగా పంపించేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌చౌదురి గత కొంత కాలంగా ఢిల్లీలోని న్యూ మోతీబాగ్‌ హౌస్‌లో ఉంటున్నారు.

అయితే అతని గడువు పూర్తవడంతో ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని కేంద్రం ఇప్పటికే పలుమార్లు సూచించింది. రంజన్‌చౌదురి ఈ విషయమై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రంజన్‌ పిటిషన్‌ను కొట్టివేసి ఇంటిని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.

Evicted! Congress' Adhir Ranjan Chowdhury Stayed A Year Too Long

దీంతో కేంద్ర ప్రభుత్వం పోలీసుల సాయంతో మంగళవారం ఆ ఎంపీని ఇంటి నుంచి పంపించేసింది. దీనిపై రంజన్‌ మాట్లాడుతూ.. తనను వెళ్లగొట్టడం వెనుక రాజకీయపరమైన కారణాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక దీనిపై తానేమీ మాట్లాడబోనని.. తన సామాన్లను పోలీసులకే వదిలేశానని తెలిపారు. అందులో ఏ ఒక్కటి కనిపించకుండా పోయినా.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాగా, ఈ కాంగ్రెస్ ఎంపి.. గడువు ముగిసినా దాదాపు రెండేళ్లపాటు ప్రభుత్వ నివాసంలో ఉండటంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం ఎట్టకేలకు బలవంతంగా ఖాళీ చేయించింది.

English summary
Ten policemen stood and watched as an officer of the Directorate of Estates -- under the Urban Development Ministry -- politely tried convincing Congress lawmaker Adhir Ranjan Chowdhury to vacate the government bungalow he occupied till this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X