నర్సింగ్ కాలేజ్ అమ్మాయిని రాత్రి నరికి చంపేసిన మాజీ బాయ్ ఫ్రెండ్, ఐదు ఏళ్ల ప్రేమకు ?
మంచి ఉద్యోగం చెయ్యాలని ఆ యువతి అనేక ఆశలు పెంచుకుంది. ఇంటి సమీపంలోకి వెళ్లిన నర్సింగ్ కాలేజ్ అమ్మాయిని ఆమె ప్రియుడు నరికి చంపేయడం కలకలం రేపింది.
చెన్నై/ విల్లుపురం: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తరువాత కాలేజ్ అమ్మాయి, అతను ప్రేమించుకున్నారు. ప్రతిరోజు ఆ యువతి ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. నర్సింగ్ పూర్తి చేసిన తరువాత మంచి ఉద్యోగం చెయ్యాలని ఆ యువతి అనేక ఆశలు పెంచుకుంది. అయితే ఇంటి సమీపంలోకి వెళ్లిన నర్సింగ్ కాలేజ్ అమ్మాయిని ఆమె ప్రియుడు అతి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

నర్సింగ్ కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రవాండి సమీపంలోని రాధాపురం ప్రాంతంలో సుదర్శన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సుదర్శన్ కుమార్తె ధరణి (19) విల్లుపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ధరణి ప్రతిరోజు సొంత గ్రామం నుంచి విల్లుపురంలోని కాలేజ్ కు బస్సులో వెళ్లి వస్తోంది.

ప్రేమలో పడిన ధరణి
మధురపాక్కం గ్రామానికి చెందిన గణేశన్ అనే యువకుడితో కొన్ని సంవత్సరాల క్రితం ధరణికి పరిచయం అయ్యింది. తరువాత రానురాను ధరణి, గణేశన్ ల పరిచయం ప్రేమకు దారి తీసింది. రోజు కాలేజ్ కు వెలులున్న ధరణి అప్పుడప్పుడు కాలేజ్ కు నామం పెట్టి ప్రియుడు గణేశన్ తో సినిమాలు, షికార్లకు తిరగడం మొదలుపెట్టింది. ధరణి ప్రేమ వియం ఆమె ఇంట్లో తెలీదు.

ప్రియురాలిని చంపేసిన ప్రియుడు
గురువారం రాత్రి ధరణి ఇంటి సమీపంలోకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన గణేశన్ కొడవలితో అతని ప్రియురాలు ధరణి మీద దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కేకలు వేసిన ధరణి అక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ధరణి రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది.

మాట్లాడలేదని చంపేసిన శాడిస్టు ప్రియుడు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ధరణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. హత్యకు గురైన ధరణిని ఇంకో కాలేజ్ విద్యార్థి గణేశన్ గత 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడని పోలీసులు అన్నారు. అయితే కొన్ని నెలల క్రితం ధరణి, గణేశన్ ల మధ్య తేడాలు వచ్చాయని, తరువాత ధరణి ఆమె ప్రియుడు గణేశన్ ను దూరం పెట్టి అతనితో మాట్లాడటటం మానేసిందని పోలీసులు చెప్పారు, తనతో మాట్లాడడం మానేయడంతో ఆవేశానికి లోనైన గణేశన్ అతని మాజీ ప్రియురాలు ధరణిని హత్య చేసి పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications