EX CM: ప్రధాని మోదీపై ఫైర్, జాతీయ జెండాకు అవమానం అని మాజీ సీఎం మీద కేసు పెట్టిన బీజేపీ !
బెంగళూరు/చిక్కమగళూరు: జాతీయ జెండాను అవమానించారని మాజీ ముఖ్యమంత్రి మీద అధికార పార్టీ నాయకులు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్బంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సందర్బంలో జాతీయ జెండాను, జాతీయ జెండా రంగులను అవమానించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటీష్ వాళ్లతో పోరాటం చేసింది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాత్రమే అని, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏమీ చెయ్యలేదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

ప్రధాని మోదీ నాటకాలు ఆడుతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ నాటకాలు ఆడుతున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య ఇటీవల ఆరోపించారు. గతంలో జాతీయగీతం, జాతీయ జెండాను అవమానించిన బీజేపీ నాయకులు ఇప్పుడు హర్ గర్ తిరంగా పేరుతో పెద్ద నాటకానికి తెర తీశారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ మాత్రమే
భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటీష్ వాళ్లతో పోరాటం చేసింది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. స్వాతంత్రం రావడానికి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బీజేపీ నాయకులు చేసింది ఏమీ లేదని, వాళ్లు గతంలో జాతీయ జెండాను అవమానించారని, ఇప్పుడు మోదీ నాటకాలు ఆడుతున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు.

కాషాయాన్ని నలుపు రంగుతో పోల్చిన మాజీ సీఎం ?
జాతీయ జెండాలోని కాషాయ రంగును నలుపు రంగుతో అభివర్ణించిన మాజీ సీఎం సిద్దరామయ్య జాతీయ జెండాను అవమానించారని కర్ణాటకలోని చిక్కమగళూరులో బీజేపీ నాయకులు మంపడిపడుతున్నారు. జాతీయ జెండాను, జాతీయ జెండా రంగులను అవమానించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు చిక్కమగళూరులో పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
Recommended Video


సీటీ రవి సొంత ఊరిలో కేసు
బీజేపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి సిటీ రవి స్వగ్రామం అయిన ఆలూరు పోలీస్ స్టేషన్ లో మాజీ సీఎం సిద్దరామయ్య మీద చిక్కమగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు గిరీష్, భజరంగ్ దళ్ నాయకుడు శివకుమార్ కేసు పెట్టారు. అయితే ఈ విషయాన్ని మాజీ సీఎ: సిద్దరామయ్య చాలా లైట్ గా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు అంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications