మార్కులు: మాజీ ఎంపి బంధువైన యువతి ఆత్మహత్య

వివరాల్లోకి వెళితే.. దేవాస్ మాజీ ఎంపి సజ్జన్ సింగ్ వర్మ బంధువైన గీతాంజలి అనే యువతి బి.కాం చదువుతోంది. ఆమె శనివారం విషం తాగడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది.
జుని ఇండోర్ పోలీసుల కథనం ప్రకారం.. గీతాంజలి ఇటీవల జరిగిన బి.కాం పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి, అసంతృప్తికి లోనై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత ఇతర వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications