మధ్యప్రదేశ్ గవర్నర్‌గా గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్
న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆనందీ బెన్‌ను గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ట్విట్టర్‌లో పేర్కొంది.

ప్రస్తుతం అక్కడి ఇంచార్జి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లీ స్థానంలో ఆనందీని నియమించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పగ్గాలు చేపట్టారు.
అంతకుముందు 2002 నుంచి 2007 వరకు గుజరాత్ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె 2016లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications