EX lover: ప్రియుడికి ముందే ?, నర్సుకు షాక్, ఆసుపత్రిలో ప్రియురాలిని కాల్చి చంపిన వార్డు బాయ్!
భోపాల్/బెంగళూరు: ఒకే ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సుతో ఓ వ్యక్తికి పరిచయం అయ్యింది. నర్సుతో ఆ యువకుడు చనువు పెంచుకున్నాడు. ఆసుపత్రిలో పని పూర్తి అయిన తరువాత ఇద్దరు బయట తిరగడం మొదలుపెట్టాడు. నర్సును ఆ యువకుడు అతని బైక్ లో బయట తిప్పుతూ పానీపూరీలు, టిఫిన్ లు, ఐస్ క్రీమ్ లు తింటూ కొంతకాలం గడిపాడు. యువతితో సన్నిహితంగా ఉంటున్న ఆ యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పని చేస్తున్న యువకుడితో నీ తిరుగుడు ఏంది అంటూ సాటి నర్సులు బుద్దిమాటలు చెబుతున్నా ఆ అమ్మాయి పెద్దగా పట్టించుకోలేదు.
అయితే వార్డ్ బాయ్ అసలు మ్యాటర్ తెలుసుకున్న నర్సు షాక్ అయ్యింది. వార్డ్ బాయ్ కి ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇంతకాలం తనతో తిరుగుతూ ఎంజాయ్ చేసి నన్ను మోసం చేశాడని తెలుసుకున్న నర్సు రగిలిపోయింది. వార్డ్ బాయ్ ని దూరం పెట్టిన నర్సు ఇంట్లో చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. ఇప్పటికే ఆ నర్సు పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 14వ తేదీన తనకు కాబోయే భర్తతో బర్త్ డే చేసుకోవాలని ఆ నర్సు కొత్త బట్టలు తీసుకుంది.
ఇంతలో వార్డ్ బాయ్ తనకు దక్కని నర్సు ఎవ్వరికి దక్కకూడదని, ఆమెను చంపేయాలని స్కెచ్ వేశాడు. రివాల్వర్ తీసుకున్న వార్డ్ బాయ్ నేరుగా వెళ్లి మాజీ ప్రియురాలి మీద రివాల్వర్ తో కాల్పులు జరిపి చంపేశాడు. నర్సును హత్య చేసిన చోట రివాల్వర్ విసిరేసి వెళ్లిపోయిన వార్డ్ బాయ్ పోలీసులకు ముందు లొంగిపోయాడు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన నర్సు మాజీ ప్రియుడి చేతిలో హత్యకు గురికావడంతో ఆసుపత్రిలోని సిబ్బంది హడలిపోయారు.

ఒకే ఆసుపత్రిలో నర్సు, వార్డ్ బాయ్ ఉద్యోగం
మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాలోని ఆసుపత్రిలో నేహా (23) అనే యువతి నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. ఇదే ఆసుపత్రిలో రితేష్ (28) అనే యువకుడు 8 సంవత్సరాల నుంచి వార్డు బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సు నేహాతో రితేష్ కు పరిచయం అయ్యింది. నర్సు నేహాతో రితేష్ చనువు పెంచుకున్నాడు.

నర్సుతో వార్డ్ బాయ్ లవ్ స్టోరీ
ఆసుపత్రిలో పని పూర్తి అయిన తరువాత నేహా, రితేష్ ఇద్దరు బయట తిరగడం మొదలుపెట్టాడు. నర్సు నేహాను రితేష్ అతని బైక్ లో బయట తిప్పుతూ పానీపూరీలు, టిఫిన్ లు, ఐస్ క్రీమ్ లు తింటూ కొంతకాలం గడిపాడు. నేహాతో సన్నిహితంగా ఉంటున్న వార్డ్ బాయ్ రితేష్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

ప్రియుడికి ఇద్దరు పిల్లలు......నర్సు మైండ్ బ్లాక్
ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పని చేస్తున్న రితేష్ నీ తిరుగుడు ఏంది అంటూ నేహాకు సాటి నర్సులు బుద్దిమాటలు చెప్పారు అయితే నేహా మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయితే వార్డ్ బాయ్ రితేష్ అసలు మ్యాటర్ తెలుసుకున్న నర్సు నేహా షాక్ అయ్యింది. వార్డ్ బాయ్ రితేష్ కు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇంతకాలం తనతో తిరుగుతూ ఎంజాయ్ చేసి నన్ను మోసం చేశాడని తెలుసుకున్న నర్సు నేహా రగిలిపోయింది.

వేరే అబ్బాయితో నర్సు పెళ్లి డేట్ ఫిక్స్
వార్డ్ బాయ్ రితేష్ ను దూరం పెట్టిన నర్సు నేహా ఆమె ఇంట్లో చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. ఇప్పటికే నర్సు నేహాకు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 14వ తేదీన తనకు కాబోయే భర్తతో బర్త్ డే చేసుకోవాలని నర్సు నేహా కొత్త బట్టలు తీసుకుంది.
Recommended Video

మాజీ గర్ల్ ఫ్రెండ్ ను కాల్చి చంపేసిన వార్డ్ బాయ్
ఇంతలో వార్డ్ బాయ్ రితేష్ తనకు దక్కని నర్సు నేహా ఎవ్వరికి దక్కకూడదని, ఆమెను చంపేయాలని స్కెచ్ వేశాడు. రివాల్వర్ తీసుకున్న వార్డ్ బాయ్ రితేష్ నేరుగా వెళ్లి మాజీ ప్రియురాలు నేహా మీద రివాల్వర్ తో కాల్పులు జరిపి చంపేశాడు. మాజీ గర్ల్ ఫ్రెండ్ నేహాను హత్య చేసిన చోట రివాల్వర్ విసిరేసి వెళ్లిపోయిన వార్డ్ బాయ్ రితేష్ పోలీసులకు ముందు లొంగిపోయాడు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన నర్సు నేహా ఆమె మాజీ ప్రియుడు రితేష్ చేతిలో హత్యకు గురికావడంతో ఆసుపత్రిలోని సిబ్బంది హడలిపోయారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications