సీఎంకు షాక్ ఇచ్చి ప్రతిపక్షంలో చేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీటు, పదవి పోయే !

లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తొలిసారిగా పదవి చేపట్టిన తరువాత ఆయన మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రిగా పనిచేసిన పవర్ ఫుల్ లీడర్ గత 50 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

శనివారం బెంగళూరులోని కర్ణాటక బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, హనగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మనోహర్ తహసీల్దార్ బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతం, నరేంద్ర మోదీ నాయకత్వానికి మెచ్చి మనోహర్ తహసీల్దార్ తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. టికెట్ సహా ఎలాంటి షరతులు లేకుండా బీజేపీలో చేరానని మాజీ మంత్రి అన్నారు.

Ex-minister Manohar joined BJP in a shock to the Siddaramaiah government

2023 అసెంబ్లీ ఎన్నికల్లో హానగల్ నియోజకవర్గం టికెట్ ఆశించిన మనోహర్ తహసీల్దార్ చివరికి టికెట్ దక్కించుకోలేకపోయారు. శ్రీనివాస మనేకి కాంగ్రెస్ టిక్కెట్ దక్కింది. ఆ తర్వాత మనోహర్ తహసీల్దార్ కాంగ్రెస్‌ను వీడి జేడీఎస్‌లో చేరారు. మనోహర్ తహసీల్దార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ టిక్కెట్ మీద పోటీ చేసి 8,834 ఓట్ల మాత్రమే సంపాధించడంతో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జేడీఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మనోహర్ తహసిల్దార్ చివరికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి మనోహర్ తహసిల్దార్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి.

అనంతరం కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై బీజేపీలో చేరాలని మాజీ మంత్రి మనోహర్ తహసిల్దార్ నిర్ణయించుకున్నారు. జేడీఎస్‌లో చేరి గత ఎన్నికల్లో ఓడిపోయిన మనోహర్‌ తహసీల్దార్‌ ఇప్పుడు బీజేపీలో చేరిపోవడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వదంతులకు తెరపడింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి మనోహర్ తహసిల్దార్ మీడియాతో మాట్లాడారు. తాను మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే ఆసక్తి లేదని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ గత కొంతకాలంగా మాజీ మంత్రి మనోహర్ తహసీల్దార్‌ను బీజేపీలోకి తీసుకురావాలని ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్‌ను వీడేటప్పుడు మనోహర్ తహసీల్దార్ కాంగ్రెస్ నన్ను బాగా చూసుకోలేదని, 50 ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన నాకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. హానగల్ నియోజకవర్గం ఆశించినా తనను కాదని శ్రీనివాస మానెకు టికెట్ ఇవ్వడంపై అప్పట్లో మనోహర్ తహసిల్దార్ సిద్దరామయ్య మీద మండిపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

నేను 50 ఏళ్లుగా కాంగ్రెస్‌ కోసం పనిచేశానని, కాంగ్రెస్‌ పార్టీ నాకు తల్లిలాంటిదని, కానీ పార్టీని తల్లిలా చూసుకున్నందుకు కాంగ్రెస్‌ తనకు తీరని ద్రోహం చేసిందని, తాను చేసిన పనికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు రాలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు తాను కాంగ్రెస్ పార్టీ పిలుపుకోసం వేచి చూశానని, గుర్తింపు రాని చోట ఉండకూడదు అనుకుని తాను ఆ పార్టీని గుడ్ బై చెప్పి బీజేపీలో చేరానని మాజీ మంత్రి మనోహర్ తహసిల్దార్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+