ఆ కాంట్రాక్టర్ కు రూ 40 కోట్లు సంపాదించే అంతసీన్ లేదు, అది హైకమాండ్ బ్లాక్ మని అంటా?

బెంగళూరు: బెంగళూరు (Bengaluru) మాజీ కార్పొరేటర్, బీబీఎంపీ కాంట్రాక్టర్ అంబికాపతి నాకు బాగా తెలుసు, అంబికాపతి తన జీవితంలో రూ 42 కోట్లు సంపాదించలేదని, ఆయనకు అంత సీన్ లేదని కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు (Bengaluru) నగరంలోని ఆర్ఆర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అన్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి మునిరత్న మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కాంట్రాక్టర్ అని, అయినప్పటి నుంచి అంబికాపతిని చూస్తున్నానని, ఆయన రూ. 50 ,000, ఒక లక్ష కాంట్రాక్టర్ (contractor) పనులు చేసుకుంటూ అంచెలంచెలుగా ఐదు లక్షల, పది లక్షలకు పనిచేవాడని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నా అన్నారు. మాజీ కార్పొరేటర్ మునిరత్నా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి 20 ఏళ్లు పూర్తయ్యాయని మునిరత్నం అన్నారు.

Ex-minister Muniratna says the money caught in the IT raid in Bengaluru is the Congress partys block

అంబికాపతి కుటుంబం( family) మొత్తం నాకు చాలా సంవత్సరాల నుంచి బాగా తెలుసు. కొన్ని కారణాల వల్ల అతను అంత డబ్బు సంపాదించలేదని, 40 ఏళ్ల వ్యక్తి ఇంత ఆస్తిని, ఇంత డబ్బు సంపాదించడం సాధ్యం కాదని మాజీ మంత్రి మునిరత్నా మీడియాకు చెప్పారు. బెంగళూరు (Bengaluru) అంబికాపతికి అంత పెద్ద ఇల్లులేదని, అప్పట్లో ఇల్లు కట్టుకున్నారు, అయితే ఒక్కసారిగా రూ. 42 కోట్లు వచ్చాయి అంటే మాకు నమ్మశక్యంగా లేదని మాజీ మంత్రి మునిరత్న అన్నారు.

అంబికాపతి కాంట్రాక్టర్ల (contractor) సంఘం అనే పేరు పెట్టుకోవడం కంటే కాంగ్రెస్ ఏజెంట్ల సంఘం లాంటి పేరుపెట్టుకుంటే మంచిది అని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అన్నారు. కాంట్రాక్టర్ల సంఘం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధీనంలో ఉందనడానికి ఇదే పెద్ద నిదర్శనం, ఐటీ దాడుల్లో అంబికాపతి ఇంట్లో చిక్కిన రూ 42 కోట్లు ఆయన సొమ్ము అవునా ? కాదా ? అని కర్ణాటక ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి మునిరత్న డిమాండ్ చేశారు.

Ex-minister Muniratna says the money caught in the IT raid in Bengaluru is the Congress partys block

ఐటీ దాడుల్లో చిక్కిన డబ్బు బెంగళూరు డబ్బు. ఈ డబ్బు మొత్తం ఐదు రాష్ట్రాలకు పంపాలి. ఒక్కో రాష్ట్రానికి వెయ్యి కోట్లు లేదా పదివేల కోట్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ (congress)పార్టీ హైకమాండ్ కర్ణాటక ప్రభుత్వానికి సూచించిందని కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు (Bengaluru)నగరంలోని ఆర్ఆర్ నగర నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆరోపించారు.

కాంగ్రెస్ (congress)కాంట్రాక్టర్ ఇంటిపై ఐటీ దాడి ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు మాజీ మంత్రి మునిరత్న స్పందిస్తూ సహజంగానే ఐటీ దాడిని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ ఖండించి ఉండాల్సిందని అన్నారు. కానీ సిద్దరామయ్య (siddaramaiah), డీకే శివకుమార్ ఖండించడం లేదు. ఎందుకంటే ఈ డబ్బు ఏఐసీసీకి పంపిచాల్సి ఉందని, డబ్బుతో కాంగ్రెస్‌కు (congress) ప్రత్యక్ష సంబంధం ఉందని మాజీ మంత్రి మునిరత్న ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+