తల్లిదండ్రులను హత్య చేసిన మాజీ మోడల్‌కు యావజ్జీవ శిక్ష
లక్నో: తల్లిదండ్రులను అతి దారుణంగా హత్య చేసిన కేసులో మాజీ మోడల్, ఆమె స్నేహితురాలికి కోర్టు యావజ్జీవ కారగారశిక్ష విదించింది. లక్నోకు చెందిన మాజీ మోడల్ ప్రియాంక సింగ్, ఆమె స్నేహితురాలు అంజు యావజ్జీవ శిక్ష పడింది. శిక్షతో పాటు ఇద్దరికి రూ.20,000 చోప్పున అపరాధ రుసుం విధించారు.
మీరట్ లోని ప్రేమ్ ప్రయోగ్ కాలనీలో ప్రేమ్ వీర్ సింగ్ (65), సంతోష్ సింగ్ (62) దంపతులు నివాసం ఉండేవారు. వీరి కుమార్తె ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్ మోడల్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే ప్రియాంక సింగ్ కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడేదని సమాచారం.
2008వ సంవత్సరం నవంబర్ 11వ తేదిన ప్రేమ్ వీర్ సింగ్, సంతోష్ సింగ్ దంపతులు హత్యకు గురైనారు. దంపతులను కత్తులతో పోడిచి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ప్రియాంక సింగ్ పోంతనలేని సమాధానం చెప్పింది.

అదే సంవత్సరం నవంబర్ 17వ తేదిన ప్రియాంక సింగ్, అంజులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తన తల్లిదండ్రులను స్నేహితురాలు అంజుతో కలిసి తానే కత్తులతో పోడిచి హత్య చేసినట్లు ప్రియాంక సింగ్ అంగీకరించింది.
పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. మీరట్ జిల్లా కోర్టులో కేసు విచారణ జరిగింది. తల్లిదండ్రులను హత్య చేసిన ప్రియాంక సింగ్, జంట హత్యలకు సహకరించిన అంజులకు యావజ్జీవ శిక్ష విదిస్తున్నామని న్యాయమూర్తి రామకృష్ణన్ గౌతమ్ తీర్పు వెలువరించారు.
ఆస్తి తగదాలు, కుటుంబ సమస్యలతో నిత్యం ప్రియాంక సింగ్ కుటుంబ సభ్యులతో గొడవపడేదని పోలీసులు అన్నారు. అంతే కాకుండ తాను సంపాదించి తీసుకువచ్చిన సోమ్ము తీసుకుని తనను నిర్లక్షంగా చూసినందుకే హత్య చేశానని ప్రియాంక సింగ్ చెప్పిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications