ట్విస్ట్: కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌పై హత్యాచారం అభియోగాలు, అరెస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థినిపై హత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ఆర్టీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) తోపాటు తొలుత ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.

దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాధారాలను దాచేందుకు యత్నించారన్న ఆరోపణలపై వారిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అంతేగాక, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అత్యాచారం, హత్య అభియోగాలను చేర్చినట్లు ఓ అధికారి తెలిపారు. మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Ex-Principal of Kolkata RG Kar Arrested on Rape Murder Charges

సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజిత్ మండల్‌లను సీబీఐ అరెస్టు చేయడంపై కేంద్రమంత్రి సుకాంత మజుందార్ స్పందించారు. 'ఈ రోజు చేసిన అరెస్టులు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అరెస్టు. అత్యాచారం కేసులో అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టయ్యారు. వాళ్లను అరెస్టు చేయాలని బెంగాల్ ప్రజలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, ఒక చిన్న స్టేషన్ ఇన్‌చార్జి అలాంటి నిర్ణయం తీసుకోగలడా? ఇక బెంగాల్ ప్రజలు ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి తొలగిస్తారు' అని సుకాంత మజుందార్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సీఎం మమతకు చర్చల కోసం వెళ్లిన వైద్యులు

జూనియర్ వైద్యులు, మమతా బెనర్జీ​ ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం రెండోసారి సీఎం ఆహ్వానం మేరకు చర్చించడాని వెళ్లిన వైద్యులు లైవ్​ స్ట్రీమింగ్ చేయాలంటూ పట్టుబట్టారు. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సాధ్యం కాదని సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. వైద్యులు తనను పదేపదే తనను అవమానించడం తగదని మమత వ్యాఖ్యానించారు. దీంతో వెనక్కి తగ్గని డాక్టర్లు చర్చలు జరపకుండానే వెనుదిరిగారు.

దీనికి ముందు జరిగిన పరిణామాలపై ఓ వైద్యుడు మీడియాకు వివరాలు చెప్పారు. 'ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని మేం కోరాం. సీఎం నివాసంలో లైవ్ స్ట్రీమింగ్ సాధ్యం కాదని చీఫ్ సెక్రటరీ తెలిపారు. పారదర్శకత కోసం లైవ్ స్ట్రీమింగ్ కావాలని మేము సీఎస్‌​కు చెప్పాము. అంతేకాకుండా, లైవ్ ​స్ట్రీమింగ్‌​కు బదులు, దయచేసి మా వీడియోగ్రాఫర్‌ని అనుమతించండి అని కోరాం. అతను మీటింగ్​‌ను రికార్డ్ చేస్తాడు. భద్రతా కారణాల దృష్ట్యా మేము ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకుంటున్నాము. ఈ సమావేశంలో పారదర్శకత కోసమే లైవ్​ స్ట్రీమింగ్ కావాలంటున్నాం. నిరసన తెలుపుతున్న ఇతర డాక్టర్లు కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని మేము సీఎం ఇంటి ముందు వేచి చూస్తున్నాం'' అని జూనియర్ డాక్టర్ తెలిపారు. కాగా, దాదాపు రెండు గంటలపాటు వర్షంలోనే మమతతో చర్చల కోసం వేచి చూశారు వైద్యులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+