వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శానిటైజర్ల అతి వాడకం మరింత ప్రమాదకరం: ఎయిమ్స్, ఔషధాలు పనిచేయవు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని దూరం పెట్టేందుకు ప్రజలు ఎక్కువగా హ్యాండ్ శానిటైజర్లను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే, హ్యాండ్ శానిటైజర్లను అతిగా వాడటం వల్ల ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వైద్య నిపుణుల బృందం తేల్చింది.

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా: కొత్త కేసుల కంటే, కోలుకున్నవారే ఎక్కువ, జిల్లాల వారీగా..ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా: కొత్త కేసుల కంటే, కోలుకున్నవారే ఎక్కువ, జిల్లాల వారీగా..

అతిగా హ్యాండ్ శానిటైజర్ల వినియోగం కారణంగా యాంటీమైక్రోబియల్ నిరోధకత సామర్థ్యం పెరిగి.. వ్యాధికారక సూక్ష్మజీవులపై ఔషధాల ప్రభావం తగ్గిపోతుందని ఎయిమ్స్ వైద్య బృందం వెల్లడించింది. ఇది ఇలా కొనసాగితే 2050 నాటికి ఔషధాలు పనిచేయక, ఏటా కోటి మంది ప్రమాదంలో పడతారని హెచ్చరించింది.

Excessive use of hand-sanitizers may boost antimicrobial resistance

యాంటీబయోటిక్స్ నిరోధకతపై ఎయిమ్స్, అమెరికా సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్‌లో పలు కీలక అంశాలపై చర్చించారు. ఎయిమ్స్ మైక్రో బయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ రామచౌదరి ఈ వెబినార్‌కు అధ్యత వహించారు.

ప్రపంచ దేశాల్లో కరోనా విస్తరణ, యాంటీ మైక్రోబియాల్ నిరోధకతతోపాటు వైద్య, మౌలిక సదుపాయాలపై కరోనావైరస్ ప్రభావం గురించి సదస్సులో కీలకంగా చర్చించారు. కాగా, పెరుగుతున్న శానిటైజర్ల వినియోగాన్ని అదుపు చేయకపోతే.. 2050 నాటికి ప్రతి ఏడాది కోటి మంది ప్రమాదంలో పడతారన్నారు. భవిష్యత్ మరింత దారుణంగా ఉండనుందని హెచ్చరించారు.

అయితే, ప్రపంచ దేశాలు దేశ, ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కరోనా లాక్‌డౌన్ ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు సాధారణ పరిస్తితుల్లోలానే సంచరిస్తున్నారు. దీంతో శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి అంటూ వాడాలంటూ ప్రభుత్వాలు చెబుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా కరోనాను దూరం పెట్టేందుకు వాటిని వాడక తప్పడం లేదు.

Recommended Video

North Korea : Kim Jong-un Tears Up During Emotional Speech At Parade | Oneindia Telugu

English summary
Increased usage of antibiotics during Covid-19 can lead to more antimicrobial resistance, health experts of the All India Institute of Medical Sciences said, adding that the widespread use of hand-sanitisers and antimicrobial soaps can further worsen the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X