వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఒక్కటి తప్ప బీజేపీకి భంగపాటు -కొత్త దిశలోకి దేశం -ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలివే: పవార్ జోస్యం

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి మినహా బీజేపీకి భంగపాటు తప్పదని, ఇతర రాజకీయ పార్టీలు బలం పుంజుకునే అలాంటి ధోరణి దేశానికి కొత్త దిశను ఇస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. పుణె జిల్లాలోని బారమతిలో పర్యటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఫలితాలపై జోస్యం చెప్పారిలా..

మోదీకి భారీ షాక్ -ఈ పాపం మనకొద్దు -ఇందిరకే మృత్యువు తప్పలేదు -రైతు ఉద్యమంపై మేఘాలయ గవర్నర్మోదీకి భారీ షాక్ -ఈ పాపం మనకొద్దు -ఇందిరకే మృత్యువు తప్పలేదు -రైతు ఉద్యమంపై మేఘాలయ గవర్నర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, జనం కోసం పాటుపడుతోన్న సీఎం మమతా బెనర్జీపైనే దాడులకు బీజేపీ తెగబడుతోందని పవర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ అధినేత్రి ర్యాలీలు చేపడుతున్నారని, బీజేపీ అహంకారానికి, బెంగాల్ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతోన్న పోరుగా ఈ అసెంబ్లీ ఎన్నికలను జనం చూస్తున్నారని, మమత మరోసారి అధికారాన్ని నిలపుకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఎన్సీపీ చీఫ్ అన్నారు.

Excluding Assam, BJP will lose all 4 Assembly elections, says NCP chief Sharad Pawar

కేరళలో అధికార లెఫ్ట్ కూటమితో ఎన్సీపీ పొత్తు కొనసాగుతున్నదని, పినరయి విజయన్ సర్కారు మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోందని శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి సర్కారు కొనసాగుతుండగా, కేరళలో మాత్రం కాంగ్రెస్ ప్రత్యర్థులతో పవార్ జతకట్టడం గమనార్హం. కాంగ్రెస్ సైతం కేరళలో సీపీఎంతో తలపడుతూ, బెంగాల్ లో అదే లెఫ్ట్ తో పొత్తు పెట్టుకోవడం తెలిసిందే. ఇక

చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివేచంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుకోదగ్గ అవకాశం ఒక్క అస్సాంలో మాత్రమే ఉందని శదర్ పవార్ పేర్కొన్నారు. తనకున్న సమాచారం మేరకు ప్రస్తుతం అస్సాంలో బీజేపీ పరిస్ధితి ఓడిపోయేంత దీనంగా ఏమీ లేదని, ఆ ఒక్క రాష్ట్రం తప్ప మిగిలిన నాలుగు చోట్లా బీజేపీకి పెద్దగా ఆదరణ ఉండబోదని చెప్పారు. తమిళనాడులో ప్రజలంతా డీఎంకే వైపు ఉన్నారని, స్టాలిన్ సీఎం అవుతారని పవార్ జోస్యం చెప్పారు.

English summary
NCP chief Sharad Pawar on Sunday claimed that barring Assam, the BJP will face defeat in four other poll-bound states and the election trend in the five states will give a new direction to the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X