బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేకం: డిఆర్‌డిఓ చీఫ్‌కు వీడ్కోలు పలకనున్న అగ్ని-5 ప్రయోగం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ) అధిపతి డాక్టర్ అవినాశ్ చంద్రర్ నాలుగు దశాబ్ధాల కృషికి ఫలితంగా అగ్ని 5 క్షిపణి రూపుదిద్దుకుంది. ఈ క్షిపణి ప్రయోగంతో భారత రక్షణ వ్యవస్థ మరో ముందడుగు వేసినట్లయింది. జనవరి 31న ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి అగ్ని 5(ఉపరితలం నుంచి ఉపరితలం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి)ని ప్రయోగించినున్నట్లు విశ్వసనీయ వర్గాలు వన్ ఇండియాకు తెలిపాయి.

అదే రోజున డిఆర్‌డిఓ చీఫ్ పదవి నుంచి డాక్టర్ అవినాశ్ చందర్ వైదొలగనున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయన కాంట్రాక్ట్ ముగిసిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి దిగిపోనున్నారు.

5వేల కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సీనియర్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే వారు ఒడిశాకు చేరుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే క్షిపణి పరీక్ష విజయవంతమై తన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. కాగా, డాక్టర్ చందర్ అదే రోజున డిఆర్డీఓ చీఫ్ పదవి నుంచి తప్పుకోనున్నారు. అలా జరగని పక్షంలో మే 2016 వరకు ఆయన పదవిలో కొనసాగే అవకాశాలున్నాయి.

అగ్ని 5 మూడోసారి ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకు పిఎంవో గానీ, రక్షణ శాఖ నుంచి దీనిపై ఎలాంటి సమాచారం అందలేదు.

మూడోసారి అగ్ని 5 పరీక్ష

ఇది అగ్ని 5 క్షిపణిని ప్రయోగించడం మూడోసారి. రోడ్ మొబైల్ లాంచర్ నుంచి పరీక్షించనున్నారు. గ్యాస్ జనరేటర్ సిస్టమ్(జిజిఎస్) తోపాటు కాంపాక్ట్ సాలిడ్ రాకెట్ మోటర్ ద్వారా మిసైల్ బయటికి వస్తుంది. ఒక్కసారి బయటికి వస్తు మంటలు ఎగజిమ్ముకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటుంది.

అగ్ని 5 మూడు దశలను కలిగి ఉంటుంది. సాలిడ్ ప్రొపెల్లుడ్, రోడ్ మొబైల్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దీర్ఘకాలిక బాలిస్టిక్ క్షిపణి. 50టి సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి ఒక టన్ బరువు కలిగిన పేలోడ్‌ను 5వేల కిలోమీటర్ల వరకు మోసుకెళ్లగలదు. ఈ మూడు దశలు కూడా ఫ్లెక్స్ నోజెల్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నియంత్రించబడతాయి. ఇన్నోవేటివ్ ఇనెర్షియల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ద్వారా సూచనలు పొందుతుంది.

అగ్ని-5

అగ్ని-5

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ) అధిపతి డాక్టర్ అవినాశ్ చంద్రర్ నాలుగు దశాబ్ధాల కృషికి ఫలితంగా అగ్ని 5 క్షిపణి రూపుదిద్దుకుంది. ఈ క్షిపణితో భారత రక్షణ వ్యవస్థ మరో ముందడుగు వేసినట్లయింది.

అగ్ని-5

అగ్ని-5

జనవరి 31న ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి అగ్ని 5(ఉపరితలం నుంచి ఉపరితలం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి)ని ప్రయోగించినున్నట్లు విశ్వసనీయ వర్గాలు వన్ ఇండియాకు తెలిపాయి.

అవినాశ్ చందర్

అవినాశ్ చందర్

అదే రోజున డిఆర్‌డిఓ చీఫ్ పదవి నుంచి డాక్టర్ అవినాశ్ చందర్ వైదొలగనున్నారు.

అగ్ని-5

అగ్ని-5

ప్రధాని మోడీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయన కాంట్రాక్ట్ ముగిసిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి దిగిపోనున్నారు.

అగ్ని-5

అగ్ని-5

5వేల కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సీనియర్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే వారు ఒడిశాకు చేరుకున్నారు.

ప్రత్యక సూచనలు

మొదటి రెండు ప్రయోగాల్లో అగ్ని 5 హాట్ లాంచ్ కన్ఫిగరేషన్‌ను మోసుకెళ్లాయి. తొలి అగ్ని 5(అగ్ని 5-01) ప్రయోగం ఏప్రిల్ 19, 2012లో జరిగింది. రెండోది(అగ్ని 5-02) సెప్టెంబర్ 15, 2013లో జరిగింది. అత్యధిక సామర్థ్యం కూడిన ఈ మిసైల్ రెండుసార్లు కూడా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రెండు విజయాల తర్వాత అగ్ని 5 మూడో ప్రయోగానికి సిద్ధమైంది.

అగ్ని 5 ప్రధాన అర్కిటెక్ట్ డా. అవినాశ్

అవినాశ్ వైదొలగనున్న నేపథ్యంలో సంస్థలోని యువ ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు. ‘ఓ ల్యాబ్‌లో రెండు మిక్సింగ్ సొల్యూషన్ చేయకుండా శాస్త్రవేత్త కాలేవు. మన చీఫ్ అవినాశ్ చేసిన సేవలను ప్రభుత్వం మరిచిపోయినట్లుంది' అని డిఆర్డీఓలోని ఓ డైరెక్టర్ వన్ఇండియాకు ఫోన్ ద్వారా తెలియజేశారు.

అగ్ని 5 రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ అవినాశ్.. ఈ రంగంలో విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ‘ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎరోనాటికల్ లేదా ఏ విభాగంలోనైనా డాక్టర్ అవినాశ్ సూచనలు చేయగలరు. ఈ రంగంలో అతనికి ఎవరూ సాటిలేరనే చెప్పవచ్చు' అని ఓ అధికారి తెలిపారు.

అసాధారణ నాయకత్వం

వన్ ఇండియాతో చాలా మంది అధికారులు డాక్టర్ అవినాశ్‌తో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. సాంకేతిక పరమైన నియంత్రణ నిర్ణయాలు తీసుకున్నప్పుడు డాక్టర్ అవినాశ్ బాధ్యత తీసుకుంటారని చెప్పారు. ఆయనది అసాధారణమైన నాయకత్వమని కొనియాడారు. క్లిష్టమైన సాంకేతిక సమస్యలకు ఆయన సులభమైన పరిష్కారాలను చూపించేవారని తెలిపారు. ప్రొపల్షన్ సిస్టమ్, కంపోసిట్ రాకెట్ మోటార్స్, ఎరోస్పేస్ మెకానిజం, స్ట్రక్చరల్ డిజైన్, రీ ఎంట్రీ వెహికల్ డిజైన్, మిసైల్ ఇంటిగ్రేషన్, అడ్వాన్సుడ్ హై అక్యురెసీ నేవిగేషన్ సిస్టమ్స్, రోబస్ట్ అవియోనిక్స్ సిస్టమ్స్, మిషన్ డిజైన్, డిజైన్ ఆఫ్ మల్టీ స్టేజ్ గైడెన్స్ అల్గరిథమ్స్ లాంటి వాటిపై ఆయన దృష్టి సారించి అభివృద్ధిని సాధించారని అవినాశ్ సహోద్యోగి చెప్పారు.

మోడీ మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి ముందే డాక్టర్ అవినాశ్.. సొంతంగానే మిసైల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘ఏడు ల్యాబ్స్‌లో అనేక మంది యువ శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఏ పని చేసిన అవినాశ్ అందులో వారికి సమప్రాధాన్యం ఇస్తారం' అని మరో అధికారి తెలిపారు.

ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ సిస్టమ్

‘స్ట్రాప్ డౌన్ ఇనెర్షియల్ నేవిగేషన్' అనే కొత్త విధానాన్ని డాక్టర్ అవినాశ్ ప్రవేశపెట్టారు. ‘ఈ రోజు ప్రతీ ఎరోస్పేస్ కొన్ని మీటర్ల నుంచి కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఈ కాన్సెప్ట్ ద్వారానే ప్రయాణిస్తున్నాయి. అందుకే అతను మనకు ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవిగేషన్ సిస్టమ్స్' అని పిలవొచ్చు. అగ్ని 5ను విజయవంతంగా ప్రయోగించి ఆయనకు గొప్ప బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం' అని ఓ అధికారి తెలిపారు.

మీడియాతో ఇంటరాక్షన్లు లేవు.. పనిపైనే దృష్టి

తన పదవి కాలం ముగిస్తుందనే వార్త తెలిసిన తర్వాత డాక్టర్ అవినాశ్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆ శాస్త్రవేత్త ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘ఆయనను శుక్రవారం ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్నాం. అతను ఏమీ మాట్లాడలేదు. అతను చాలా సమీక్ష సమావేశాలను నిర్వహించారు. సాంకేతికరపమైన పాయింట్లను లేవనెత్తారు. అయితే హఠాత్తుగా తన విధుల నుంచి తొలగిపోవడంపై ఆయన మాట్లాడలేదు. అందుకు సహకరించలేదు' అని ఓ అధికారి తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అగ్ని 5 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటికే అగ్ని 5 శాస్త్రవేత్తలు ప్రయోగ స్థలం ఒడిశాకు చేరుకున్నారు. వారందరూ ఎంతో భావోద్వేగంతో ఉన్నారు.

English summary
A fitting tribute for his four-decades-plus selfless work awaits India's top missile brain and outgoing Defence Research and Development Organisation (DRDO) Chief Dr Avinash Chander.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X