వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరిశిక్ష మళ్లీ వాయిదా.. నిర్భయ దోషులకు ఇంకా ఎన్నిఆప్షన్లు ఉన్నాయో తెలిస్తే షాకవుతారు..

|
Google Oneindia TeluguNews

ఎనిమిదేళ్ల క్రితం 23 ఏళ్ల నిర్భయను ఆ నలుగురు ఒకరితర్వాత మరొకరు రేప్ చేసి చంపారు.. ఇప్పుడు కూడా ఒకడి తర్వాత ఇంకొకడు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ చావు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదుగానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడొదన్న ఉధాత్త ఉద్దేశం మన న్యాయవ్యవస్థది. చట్టప్రకారం మరణశిక్షలు అమలు చేయబోయేముందు దోషులు తమకున్న న్యాయపరమైన హక్కులన్నీ వాడుకోవచ్చని అదే చట్టం చెబుతోంది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదాపడిన నేపథ్యంలో అసలీ న్యాయ తతంగం ఇంకా ఎన్నిమలుపులు తిరుగుతుందో.. ఆ నలుగురికీ ఇంకా ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో తెల్సుకుందాం..

చావు తప్పదు.. కానీ..

చావు తప్పదు.. కానీ..

నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపిన ఆరుగురు దోషుల్లో ఒకడు జైల్లోనే ఉరివేసుకుని చనిపోగా, జువెనైల్ ఖైదీ మాత్రం మూడేళ్ల తర్వాత విడుదలై అజ్ఞాతలోకి వెళ్లిపోయాడు. మిగిలిన నలుగురు.. ముఖేష్ కుమార్ సింగ్(32), అక్షయ్ కుమార్ సింగ్(31), వినయ్ కుమార్ శర్మ(26), పవన్ గుప్తా(25)లకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో జనవరి 7న మొదటి డెత్ వారెంట్ జారీఅయింది. దాంతో వాళ్ల చావు డిసైడైపోయింది. అయితే క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్ల కారణంగా ఉరి రెండు సార్లు వాయిదాపడింది. ఇంకొన్ని రోజులపాటూ ఈ డ్రామా కొనసాగించేందుకు వాళ్ల దగ్గర కొన్ని ఆప్షన్లున్నాయి. దోషుల పేర్ల వారిగా అవేటో ఒకసారి పరిశీలిస్తే..

వినయ్ కుమార్ శర్మ

వినయ్ కుమార్ శర్మ


డెత్ పెనాల్టీ తీర్పును సవాలు చేస్తూ గత బుధవారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ తోపాటు, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. అందులో క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవాం(జనవరి 31న) కొట్టేసింది. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి దాన్ని సాకుగా చూపించి ఫిబ్రవరి 1న ఉరి లేకుండా చేసుకోగలిగాడు. ఒక వేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరిస్తే.. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసుకోవచ్చు. అంటే వినయ్ శర్మకు ఇంకా ఒక ఆప్షన్ మిగిలున్నట్లు లెక్క.

పవన్ గుప్తా

పవన్ గుప్తా

నిర్భయ దోషులు నలుగురిలో శిక్షలు వాయిదా వేయడానికి ఎక్కువ ఆప్షన్లు ఉన్నది ఇతనికే. పవన్ ఇప్పటిదాకా సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయలేదు. అది కొట్టేసిన పక్షంలో రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ మరో పిటిషన్ వేసుకోవచ్చు. రాష్ట్రపతి కూడా తిరస్కరిస్తే మళ్లీ సుప్రీంను ఆశ్రయించే సౌకర్యం కూడా ఉంది.

అక్షయ్ కుమార్ సింగ్(31)

అక్షయ్ కుమార్ సింగ్(31)

వినయ్ శర్మతోపాటే అక్షయ్ సింగ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. దీంతో ఇతనికి రెండు ఆప్షన్లు మాత్రమే మిగిలాయి. ఒకటి రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడం.. రెండోది.. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాలుచేస్తూ మళ్లీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లడం.

ముఖేష్ కుమార్ సింగ్(32)

ముఖేష్ కుమార్ సింగ్(32)

నిర్భయ కేసులో శిక్ష నుంచి తప్పించుకునే అన్ని ఆప్షన్లూ చేజారిపోయి.. ఇప్పటికిప్పుడు ఉరితీయగలిగింది ముఖేశ్ సింగ్ ఒక్కడినే. అతని క్యూరేటివ్, క్షమాభిక్ష, క్షమాభిక్షపై సవాలు పిటిషన్లన్నీ ఇదివరకే కొట్టుడుపోయాయి. అయితే ముఖేశ్ ఒక్కడినే విడిగా చంపేసే అవకాశంలేదు. శుక్రవారం పాటియాలా హౌజ్ కోర్టులో దీనిపై పెద్ద వాదనే జరిగింది.

కోర్టులో హైడ్రామా

కోర్టులో హైడ్రామా


ఒకే కేసులో దోషులైన నలుగురినీ ఒకేసారి ఉరితీయాలని తీర్పులో ఉంది. అయితే ఒకడి తర్వాత ఒకడు పిటిషన్లు వేస్తుండటం వల్ల శిక్ష అమలు వాయిదాపడుతూ వస్తోంది. ప్రస్తుతం వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ఒక్కటే పెండింగ్ లో ఉంది కాబట్టి.. మిగతా ముగ్గురినీ ఉరి తీసేస్తామని తీహార్ జైలు అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు. కానీ జడ్జి అందుకు అంగీకరించలేదు. అసలీ కేసును ‘నిరవధికంగా వాయిదా' వేయాలన్న దోషుల తరఫు వాదనను కూడా జడ్జి తోసిపుచ్చారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడిన వెంటనే తుది ఉత్తర్వులు జారీఅయ్యే అవకాశముంది. ఆ తర్వాత కూడా దోషులు తమకున్న ఆప్షన్లతో కొన్నాళ్లపాటు శిక్షలు వాయిదాపడేలా చేసే వీలుంది. ఈలోపు పిటిషన్ల దాఖలుపై ఉన్నతన్యాయస్థానం ఏదైనా రూలింగ్ ఇస్తే అనుకున్నదానికంటే ముందే ప్రక్రియ ముగిసే ఛాన్సుంది.

English summary
Delhi's Patiala court on Friday approved the plea filed by death row convicts in the Nirbhaya case convicts, seeking stay on their execution on February 1. Here's the status of legal appeals by Nirbhaya case convicts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X