త్రిపుర ఎగ్జిట్ పోల్స్: మాణిక్‌కు షాక్, ఎర్రకోటలో జెండా పాతిన బీజేపీ!
Recommended Video

త్రిపుర: వామపక్ష పార్టీకి పెట్టని కోటలా ఉన్న త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. త్రిపురతోపాటు నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. త్రిపురలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీకి భారతీయ జనతా పార్టీ షాకిచ్చిందని తేల్చాయి. ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. అయితే, సీపీఎం పాలనతో కొంత విసిగిపోయిన ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే..
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
బీజేపీ కూటమి: 45-50, లెఫ్ట్ ఫ్రంట్: 9-10
న్యూస్ఎక్స్:
బీజేపీ కూటమికి 35-45 సీట్లు వస్తాయని తేల్చగా.. లెఫ్ట్ ఫ్రంట్‌కు 14-23, కాంగ్రెస్-0
న్యూస్ఎక్స్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-31-37 స్థానాలు
First Exit Poll by News X-Jan ki Baat predicts 31-37 seats for BJP and 37+ for BJP alliance in Tripura. It predicts a comfortable victory for BJP in Tripura. Of course for cynics, 'it is only an exit poll'.😊
— Ram Madhav (@rammadhavbjp) February 27, 2018
కాగా, ఎగ్జిట్ పోల్స్.. త్రిపురలో బీజేపీదే అధికారమని తేల్చాయని బీజేపీ నేత తన ట్విట్టర్‌లో ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించారు. అసలైన ఫలితాలు ఇంకా ఆనందాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications