మోడీ పిఎం అయితే: గుజరాత్ సిఎం రేసులో ఎవరెవరు?

అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో గుజరాత్ బిజెపి నేతలు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బిజెపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడితే.. ఆ తర్వాత గుజరాత్ సిఎం ఎవరన్నదానిపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

అయితే బిజెపి మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపారేసింది. ఇది రొటీన్ సమావేశమేనని స్పష్టం చేసింది. సోమవారంతో తొమ్మిది విడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో పరిస్థితిని అంచనా వేసే ప్రక్రియలో భాగంగా గుజరాత్ బిజెపి కోర్ గ్రూపు మంగళవారం సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆర్‌సి ఫాల్దు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోడీ కేంద్రంలో ప్రధాని పదవిని చేపడితే ఆయన వారసుడిని ఎంపిక చేయడం కోసమే జరుగుతోందనే ఊహాగానాలకు తెరదీసింది.

బిజెపి లెజిస్లేచర్ పార్టీ, పార్టీ కార్యవర్గ సభ్యులతో మరో సమావేశం జరగడం, ఆ సమావేశానికి మోడీ కూడా హాజరవటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ సమావేశాలు రొటీన్ సమావేశాలేనని రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి విజయ్ రూపాని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రిపై నిర్ణయం ఏదయినా మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రమే తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. అది కూడా తమ పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకే జరుగుతుందని ఆయన చెప్పారు.

Exit poll results spark talks of finding Modi's successor

మోడీ వారుసుడి రేసులో వీరే

గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి మోడీ వారసుడిగా ఎంపిక కావచ్చని భావిస్తున్న వారిలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రచార వ్యూహకర్తగా పని చేసిన అమిత్‌షాతో పాటుగా సీనియర్ మంత్రులు ఆనందిబెన్ పటేల్, నితిన్ పటేల్, సౌరభ్ పటేల్‌తో పాటుగా రాష్ట్ర పార్టీ విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి భికు దల్సానియా వంటి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

వీరిలో ఆనందిబెన్ పటేల్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలతో సత్సంబంధాలు, మంచి నాయకురాలిగా పేరు ఉండటం, కేబినెట్‌లో సీనియర్ మంత్రిగా అపార అనుభవం కలిగిన ఆమెకు కలిసివచ్చే అంశాలు చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా నితిన్ పటేల్, దల్సానియాలయితే ఓ అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని బహిరంగంగానే ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+