వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్‌తో బీజేపీ గోల్‌మాల్.. ఈవీఎంలను మార్చే కుట్ర.. నేతల హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Exit Polls 2019 : ఎగ్జిట్ పోల్స్‌ పేరుతో... బీజేపీ... EVMలను మార్చే కుట్ర..!! || Oneindia Telugu

ఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ మరోసారి ఎన్డీయేకు జై కొట్టాయి. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే రీతిలో ఫలితాలు వెల్లడించాయి. దాదాపు అన్నీ సంస్థలు కూడా బీజేపీ కూటమికి 300 ప్లస్ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్‌పై భిన్నరకాల కామెంట్స్ చేస్తున్నారు బీజేపీయేతర పక్ష నేతలు. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వచ్చేలా బీజేపీ నేతలు కుట్ర పన్నారనేది త‌ృణమూల్ కాంగ్రెస్, ఆప్ నేతల వాదన.

ఎగ్జిట్ పోల్స్‌పై డీఎంకే చీఫ్ స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి థరూర్, అన్నా డీఏంకే పళని స్వామి తదితర నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అడ్డం పెట్టుకుని బీజేపీ నేతలు కుట్ర చేస్తారనే హాట్ కామెంట్స్ తెరపైకి రావడం చర్చానీయాంశమైంది.

సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?

ఈవీఎంలను తారుమారు చేస్తారు.. ఆప్ నేతల హాట్ కామెంట్స్

ఈవీఎంలను తారుమారు చేస్తారు.. ఆప్ నేతల హాట్ కామెంట్స్

ఎగ్జిట్ పోల్స్‌ నమ్మశక్యం కాదంటున్నారు ఆప్ నేతలు. ఇదివరకు తమ పార్టీ విషయంలో ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ సరైన ఫలితాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఆప్ లీడర్, సౌత్ ఢిల్లీ అభ్యర్థి రాఘవ్ చడ్డా ఇంకో అడుగు ముందుకేసి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు.

ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఇప్పించుకోవడం ద్వారా బీజేపీ వ్యూహం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. వాటికి అనుగుణంగా ఈవీఎంలను తారుమారు చేసే కుట్రకు తెర తీస్తారని ఆరోపించారు. ఓటింగ్ అనేది రహస్య ప్రక్రియ.. ఆ మేరకు ఎగ్జిట్ పోల్స్‌కు, క్షేత్రస్థాయి ఫలితాలకు కచ్చితంగా వ్యత్యాసం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా మే 23వ తేదీన వచ్చే ప్రజా తీర్పే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు.

ఎగ్జిట్ పోల్స్‌కు ప్రాచుర్యం.. ఈవీఎంలను మార్చే కుట్ర..!

ఎగ్జిట్ పోల్స్‌కు ప్రాచుర్యం.. ఈవీఎంలను మార్చే కుట్ర..!

ఎగ్జిట్ పోల్స్ వచ్చిన మరుక్షణమే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తాను నమ్మబోనంటూ తేల్చి చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌ను జనాల్లోకి బాగా తీసుకెళ్లి.. వాటికి ఎక్కడాలేని ప్రాచుర్యం కల్పించి తద్వారా మోసాలకు తెర తీసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఆ క్రమంలో ఈవీఎంలను ఒక చోట నుంచి మరో చోటకు తరలించి కుట్రలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌ను గాసిప్ అంటూ కొట్టి పారేసిన దీదీ.. ఆ మేరకు ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. ఈ సమయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

కొన్నిసార్లు రైట్.. కొన్నిసార్లు రాంగ్..!

కొన్నిసార్లు రైట్.. కొన్నిసార్లు రాంగ్..!

వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. ఆయా సంస్థలు వెల్లడించే సర్వే ఫలితాల అంచనాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో నూటికి 90 శాతం పైగా ఎగ్జిట్ పోల్స్ నిజమైన దాఖలాలున్నాయి. అదే సమయంలో విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈసారి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేకు పట్టం కట్టడంపై బీజేపీయేతర పక్షాలు హాట్ కామెంట్స్ చేస్తున్నాయి.

English summary
BJP Opposition Party Leaders made hot comments on Exit Polls. They Argued that The NDA tries to manipulate EVMs in the name of exit polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X