Omicron Virus : పిల్లలకు గుడ్ న్యూస్- వ్యాక్సిన్లు అక్కర్లేదన్న నిపుణుల కమిటీ-కేంద్రానికి రిపోర్ట్
భారత్ లో ఓమిక్రాన్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల బూస్టర్ డోస్ డిమాండ్ కూడా పెరుగుతోంది. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ ఒక్క డోస్ కూడా వేయించుకోని వారు దేశంలో సగానికి పైగా ఉన్నారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే కోవిడ్ ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ కోరుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా పిల్లల వ్యాక్సిన్లపై ప్రయోగాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ దీనిపై ఓ కీలక సూచన చేసింది.

భారత్ లో ధర్డ్ వేవ్ భయాలు
భారత్ లో ఈ ఏడాది మధ్యలో ఆరంభమైన కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మూడో వేవ్ తధ్యమన్న రిపోర్టులు వచ్చాయి. అయితే వీటిలో ఏవీ నిజం కాలేదు. కానీ ఓమిక్రాన్ వైరస్ మాత్రం దక్షిణాఫ్రికా నుంచి మన దేశంలోకి ప్రవేశించింది. ఇప్పుడు దాన్ని గుర్తించి కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దాదాపు 12 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఓమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. వీటి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి నియంత్రణ సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది అయితే అదే సమయంలో పిల్లలపై ఓమిక్రాన్ ప్రభావంపైనా భయాలు నెలకొన్నాయి.

పిల్లలపై కరోనా ముప్పు
కరోనా ధర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సహా ఇతర సంస్ధలు, శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలు అన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. ఈ నేపథ్యంలో ఓమిక్రాన్ ముప్పు భయం ఇప్పుడు చిన్నారుల్ని వెంటాడుతోంది. దీంతో కేంద్రం కూడా చిన్నారుల వ్యాక్సిన్లపై ప్రయోగాలకు సైతం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తయారీదారులు కూడా వ్యాక్సిన్లపై ప్రయోగాలు మొదలుపెట్టేశారు. ఇలాంటి తరుణంలో అసలు పిల్లలకు వ్యాక్సిన్లు అవసరమా లేదా అనే చర్చ కూడా సాగుతోంది.
Recommended Video

పిల్లలకు వ్యాక్సిన్లు వద్దన్న నిపుణుల కమిటీ
పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు వేయాలా వద్దా అన్న దానిపై శాస్త్రవేత్తలు, కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే వ్యాక్సినేషన్ పై కేంద్రం నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ తాజాగా ఓ రిపోర్ట్ ఇచ్చింది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇప్పట్లో అవసరం లేదని ఆ కమిటీ తేల్చిచెప్పింది. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించింది. భారత్ లో ఇప్పటివరకూ 12 ఏళ్ల లోపు చిన్నారులెవరూ కేవలం కరోనాతో చనిపోలేదని ప్రకటించింది. ఇప్పటిదాకా కరోనా సోకిన తర్వాత చనిపోయిన చిన్నారులంతా క్యాన్సర్, లుకేమియాతో పాటు ఇతర తీవ్ర రోగాలు కూడా సోకడం వల్ల మాత్రమే మృతిచెందారని తేల్చింది. కాబట్టి ఇప్పట్లో పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రానికి స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications