ట్రెండ్ మార్చారు: విదేశీయులు, నాయకుల టార్గెట్
న్యూఢిల్లీ: విధ్వంసాలు సృష్టించడానికి ఉగ్రవాదులు ట్రెండ్ మార్చారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, మార్కెట్ లు లక్షం చేసుకుని దాడులు చేసేవారు. అయితే వారు ట్రెండ్ మార్చారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
ఇటీవల అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను విచారణ చెయ్యగా ఈ విషయాలు వెలుగు చూశాయని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. రాజకీయ నాయకులు, విదేశీయులు, కీలక ప్రభుత్వ సంస్థలు, అధికారులను లక్ష్యం చేసుకుని దాడులు చెయ్యాలని వీరికి స్పష్టమైన ఆదేశాలు అందాయని అధికారులు తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం తెలుసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దేశ వ్యాప్తంగా పలువురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
సోమవారం 12 మంది ఉగ్రవాదులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 5వ తేది వరకు 12 మందిని ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications