నామినేషన్‌పై ట్విస్ట్: శశికళే చీఫ్, ముఖ్యమంత్రి పదవీ ఆమెకే, వ్యూహాత్మక పావులు
అన్నాడీఎంకే చీఫ్ పోస్ట్ పైన కొత్త ట్విస్ట్. జయలలిత మృతి నేపథ్యంలో పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరో గురువారం నాడు తేలిపోనుంది.
చెన్నై: అన్నాడీఎంకే చీఫ్ పోస్ట్ పైన కొత్త ట్విస్ట్. జయలలిత మృతి నేపథ్యంలో పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరో గురువారం నాడు తేలిపోనుంది. రేపు జరగబోయే కీలక సమావేశంలో జనరల్ సెక్రటరీని ఎన్నికుంటామని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి పొన్నయాన్ బుధవారం తెలిపారు.
జనరల్ సెక్రటరీ పదవికి సంబంధించి ఆయన తాజాగా ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు శశికళ సహా ఇంకా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని బుధవారం సాయంత్రం చెప్పారు.. ఈ రోజు మధ్యాహ్నం పార్టీ నుంచి బహిష్కరించబడిన ఎంపీ శశికళ పుష్ప నామినేషన్ దాఖలు చేసేందుకు తన భర్తను, లాయర్‌ను పంపించగా అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే.
అయితే, పొన్నయన్ బుధవారం మాట్లాడుతూ.. శశికళ సహా ఇంకా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదన్నారు.

శశికళను పార్టీ జనరల్ సెక్రటరీగా కాకుండా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారన్న ప్రచారంపై ఆయన ఆచితూచి స్బందించారు. సీఎం మార్పుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.
రేపటి సమావేశంజనరల్ సెక్రటరీ ఎన్నిక కోసం మాత్రమే అన్నారు. ఇదిలా ఉండగా, శశికళ ఇప్పటి దాకా నామినేషన్ దాఖలు చేయకపోయినప్పటికీ.. ఆ తర్వాత దాఖలు చేయవచ్చు.
శశికళా పోటీ లేకుండానే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కానున్నారా? ఇందుకు అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జయలలిత మృతి తర్వాత ఖాళీగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక గురువారం నాడు జరగనుంది.
సమవేశం ప్రధాన ఎజెండా కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికేనని పార్టీ ప్రతినిధి పొన్నియన్ మీడియాతో తెలిపారు. సీఎం మార్పుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ప్రధాన ఎజెండా జనరల్ సెక్రటరీ ఎన్నికే అన్నారు.
ఇంతవరకూ ఎవరూ ఆ పదవికి దరఖాస్తు చేయలేదని ఆయన చెబుతూనే, ఎన్నికకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం జనరల్ కౌన్సిల్‌కే ఉందన్నారు. సమావేశానికి శశికళ హాజరవుతారా అనే ప్రశ్నకు కూడా ఆయన ఆచితూచి సమాధానమిచ్చారు.
పోటీదారులు హాజరైనా హాజరుకాకపోయినా ప్రధాన కార్యదర్శిని జనరల్ కౌన్సెల్ ఎన్నుకుంటుందన్నారు.
శశికళ పుష్ప భర్తపై దాడి మీద..
ఎంపీ శశికళా పుష్ప భర్త, లాయర్లపై జరిగిన దాడిపై వివరణ ఇస్తూ.. మీ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించి సమస్యలు సృష్టించాలనుకుంటే ప్రతిఘటన ఉంటుంది కదా అన్నారు. అయితే హింసను తాము కానీ, పార్టీని స్థాపించిన ఎంజీ రామచంద్రన్, పార్టీని నడిపించిన జయలలిత కానీ ఏరోజూ సమర్ధించలేదన్నారు.
జనరల్ సెక్రటరీ పదవికి పోటీ లేకపోవచ్చని పొన్నియన్ చెప్పడం, పార్టీ కార్యకర్తలు, నేతల్లో శశికళా నటరాజన్‌కు మద్దతు కూడా గణనీయంగానే ఉండటంతో ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే కావచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, శశికళను ప్రధాన కార్యదర్శిగానే మాత్రమే కాకుండా శాసన సభా పక్ష నేతగా, ఆ తర్వాత సీఎంగా ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications