భారత ఫేస్‌బుక్ ఎండీ రాజీనామా: ఎందుకంటే..?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత ఫేస్‌బుక్‌ ఎండీ ఉమాంగ్‌ బేడి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. తాత్కాలిక డైరక్టర్‌గా దక్షిణాసియా ఎండీ సందీప్‌ భూషణ్‌ను నియమించారు.

కాగా, బేడి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌లోకి రాక ముందు బేడి, అడోబ్‌ కంపెనీ దక్షిణాసియా ఎండీగా పనిచేశారు.

 Facebook India MD Umang Bedi resigns, Sandeep Bhushan interim head

'ఈ ఏడాది చివరికి బేడి పదవీ కాలం ముగియనుంది ' అని ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా ఫేస్‌బుక్‌ వినియోగదారులున్న దేశం ఇండియానే కావడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Umang Bedi, managing director, India and South Asia, at Facebook has resigned, the social media network said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి