విధి నిర్వహణలో.. భారీ వర్షాన్నీ లెక్కచేయని ట్రాఫిక్ కానిస్టేబుల్, వీడియో వైరల్
ఢిల్లీలో ఓ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ భారీ వర్షంలోనూ తన విధులు నిర్వర్తించడమే కాదు, అప్పుడే బ్రేక్ డౌన్ అయిన కారును వెనక నుంచి తోస్తూ సహాయం కూడా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్ బుక్ లో వైరల్ గా
న్యూఢిల్లీ: సాధారణంగా మనం రోడ్డుపై వెళుతున్నప్పుడు వర్షం మొదలైతే ఏం చేస్తాం? చుట్టుపక్కలకు చూస్తాం.. ఏదైనా చెట్టు కనిపిస్తే.. పరిగెత్తుకుని వెళ్లి దానికింద తలదాచుకుంటాం.
మరి ఇదే పరిస్థితి రోడ్లపై విధినిర్వహణలో ఉండే ట్రాఫిక్ పోలీసులకు ఎదురైతే? వాళ్లు మాత్రం ఏం చేస్తారు? రెయిన్ కోట్, క్యాప్ ఉంటే.. వర్షం లోనూ విధులు నిర్వహిస్తారు. లేకపోతే మనలాగే తలదాచుకోవడానికి ప్రయత్నిస్తారు అంటారా?
అయితే మరి ఇది చూడండి. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ భారీ వర్షంలోనూ వాహనాలకు మార్గదర్శకం చేస్తూ విధి నిర్వహణకే తన తొలి ప్రాధాన్యం అంటున్నాడు. ఇది ఢిల్లీలో ఓ ట్రాఫిక్ పోలీసు వర్షంలోనూ విధులు నిర్వర్తిస్తుండగా తీసిన వీడియో. ప్రస్తుతం ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది.
రెయిన్ కోటు, క్యాప్ ఏమీ లేవు.. అయినా సరే ఈ ట్రాఫిక్ పోలీసు భారీ వర్షంలోనూ తన విధులు నిర్వర్తించడమే కాదు, అప్పుడే బ్రేక్ డౌన్ అయిన కారును వెనక నుంచి తోస్తూ సహాయం కూడా చేశాడు. ఈ మొత్తం సీన్ని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించిన ఢిల్లీకే చెందిన మంకన్ బమ్మి తన ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
ఇంతటి అంకిత భావం కలిగిన ట్రాఫిక్ పోలీసు పేరు కనుక్కోవడానికి ప్రయత్నించినా, తెలుసుకోలేకపోయానని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ వీడియో చూసిన వారంతా సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తున్న పని చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరూ చూడండి.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications