చికుబుకు చికుబుకు రైలే: ఢిల్లీలో నెలలో రెండుసార్లు కూతపెట్టనున్న.. ‘స్టీమింజన్ రైలు’!

ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన, నేటికీ మనుగడలో ఉన్న స్టీమింజన్ రైలు ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే. అవును, హెరిటేజ్ ట్రెయిన్ గా పేరుగాంచిన ఈ రైలు శనివారం నుంచి ఢిల్లీలో తన కూత వినిపించనుంది.

ఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన, నేటికీ మనుగడలో ఉన్న స్టీమింజన్ రైలు ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే. అవును, హెరిటేజ్ ట్రెయిన్ గా పేరుగాంచిన ఈ రైలు శనివారం నుంచి ఢిల్లీలో తన కూత వినిపించనుంది.

ఇప్పటి వరకు ఈ పర్యాటక రైలు 'ది స్టీమ్ ఎక్స్ ప్రెస్'ను నెలలో ఒకసారి రెవారీ మీదుగా ఢిల్లీ-అల్వార్ ల మధ్య తిప్పుతుండగా ఈ నెల నుంచి దీనిని నెలలో రెండుమార్లు తిప్పాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

ఫెయిరీ క్వీన్ ఎక్స్ ప్రెస్...

ఫెయిరీ క్వీన్ ఎక్స్ ప్రెస్...

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ స్టీమింజన్ రైళ్లను ఇష్టపడే పర్యాటకులకు మన దేశంలోని ఈ రైలు ఒక ప్రధాన ఆకర్షణ. దాదాపు 162 ఏళ్ల నాటి పురాతన స్టీమింజన్ తో కూడిన ఈ పర్యాటక రైలు ‘ది స్టీమ్ ఎక్స్ ప్రెస్' నెలలో ఒకసారి రెవారీ మీదుగా ఢిల్లీ-అల్వార్ ల మధ్య తిరుగుతోంది. 2017 అక్టోబరు నెల నుంచి దీనిని నెలలో రెండుసార్లు తిప్పాలని నిర్ణయించారు. ఆ ప్రకారం ఈ నెల నుంచి ప్రతి రెండో, నాలుగో శనివారం ఈ ఫెయిరీ క్వీన్ స్టీమ్ ఎక్స్ ప్రెస్ రైలు ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి రెవారీ స్టీమ్ స్టేషన్ వరకు నడుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ రైలు నడవనుంది.

 పర్యాటకంలో స్టీమింజన్ రైళ్లు...

పర్యాటకంలో స్టీమింజన్ రైళ్లు...

కొన్నేళ్లుగా భారతీయ రైల్వే.. రైల్వే టూరిజానికి సంబంధించి వినూత్న చర్యలు తీసుకుంటోంది. స్టీమింజన్ల రైళ్ల ప్రదర్శనతోపాటు కొన్ని పర్యాటక మార్గాల్లో, హిల్ ఏరియాల్లో స్టీమింజన్లతో కూడిన రైళ్లను ఇప్పటికీ నడుపుతోంది. ఈనెల 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 20 రోజులపాటు జరుగుతోన్న దేశ పర్యాటక రంగ సత్తాను ప్రదర్శించే కార్యక్రమం ‘పర్యాటన్ పర్వ్'లో ఈ స్టీమింజన్ రైళ్లకు కూడా సముచిత స్థానం కల్పించారు.

 162 ఏళ్ల క్రితం...

162 ఏళ్ల క్రితం...

1855లో కిట్సన్, థాంప్సన్, హ్యూవిట్సన్ లు ఇంగ్లాండ్ లో ఈ స్టీమింజన్ రైలును తయారు చేశారు. 5 అడుగుల 6 అంగుళాల గేజ్ ఉండే ఈ రైలు అదే ఏడాది కోల్ కతా చేరుకుంది. అప్పట్నించి ఈ రైలుకు 22 నంబర్ కేటాయించారు. అప్పట్లో ఈ స్టీమింజన్ రైలును ఈస్ట్ ఇండియా కంపెనీ తపాలా బట్వాడాకు ఉపయోగించింది. ఈ రైలు పశ్చిమ బెంగాల్ లోని హౌరా-రాణిగంజ్ మధ్యన తిరుగుతుండేది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు బ్రిటీష్ సైనికులు ఈ స్టీమింజన్ రైలులోనే ప్రయాణించారు. తరువాత ఈ రైలును రైలు మార్గాల నిర్మాణ పనుల్లో ఉపయోగించుకునేందుకు బీహార్ కు అప్పగించారు. 1909లో ఈ రైలు ఇంజనుకు విశ్రాంతినివ్వగా, తిరిగి 1977లో మల్లీ ఈ రైలును పునరుద్ధరించారు. అప్పట్నించి ఢిల్లీ చాణక్యపురిలోని జాతీయ రైలు మ్యూజియంలో దీనిని ఉంచారు.

స్టీమ్ సెంటర్ సందర్శన కూడా...

స్టీమ్ సెంటర్ సందర్శన కూడా...

ఈ స్టీమింజన్ రైల్లో 60 మంది వరకు ప్రయాణించవచ్చు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా లేదంటే ఐఆర్సీటీసీ అనుమతి పొందిన టూరిస్టు కేంద్రాల్లో, జాతీయ రైలు మ్యూజియంలో, ట్రావెల్ ఆపరేట్ల ద్వారా టిక్కెట్లు పొందవచ్చు. సందర్శకులకు రెవారీలోని స్టీమ్ సెంటర్ ను సందర్శంచే అవకాశం కూడా కల్పిస్తున్నారు. భారతీయ రైల్వేకు చెందిన 10 స్టీమింజన్ సెంటర్లలో ప్రస్తుతం నడుస్తోన్నది రెవారీలోని స్టీమ్ సెంటర్ ఒక్కటే. ఇక్కడ దాదాపు మూడు గంటలపాటు సందర్శకులకు బ్రేక్ ఇస్తారు. అనంతరం తిరిగి ఈ రైలు సాయంత్రం 4.15 గంటలకు రెవారీలో బయలుదేరి 6.15 గంటలకల్లా ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతానికి చేరుకుంటుంది.

అప్పటి ప్రధాని చేతుల మీదుగా...

అప్పటి ప్రధాని చేతుల మీదుగా...

1998లోనే ప్రపంచంలోకెల్లా నడుస్తోన్న అతి పురాతన స్టీమ్ ఇంజన్ రైలుగా ‘ఫెయిరీ క్వీన్' స్టీమ్ ఇంజెన్ ఎక్స్ ప్రెస్ గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. ఆ మరుసటి సంవత్సరమే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీదుగా నేషనల్ టూరిజం అవార్డు కూడా పొందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+