వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake news:ముంబైలో ఆర్మీని మొహరించడం లేదు, అధికారుల స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో క్రమంగా పెరుగుతున్నాయి. ముంబై, పుణెలో 90 శాతం పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో మిలిటరీ దించుతారనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వార్త తెగ వైరలవుతోంది. దీనిని అధికారులు ఖండించారు. ముంబైలో ఆర్మీని మొహరించాలని అనుకోవడం లేదు అని.. ఆ వార్త ఫేక్ అని స్పష్టంచేశాయి.

కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?

పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముంబైలో ఆర్మీని మొహరిస్తారని.. శనివారం నుంచి 10 రోజులపాటు ఆర్మీ ఆధీనంలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆర్మీ రంగంలోకి దిగితే.. ఉపేక్షించనుందని భావించి పాలు, మందులు, ఇతర నిత్యావసరాలు స్టోర్ చేసుకోవాలని కోరుతున్నారు. ముంబైలో ఆర్మీ, నేవీ విభాగాలను మొహరించడం లేదు అని అధికారులు స్పష్టంచేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఆర్మీని రంగంలోకి దించడం లేదు అని.. ఇది ఫేక్ మేసేజ్ అని.. దీనిని నమ్మొద్దని.. అలాగే ఫార్వార్డ్ చేయొద్దని సూచించారు.

Fake: Army not being deployed in Mumbai to enforce lockdown

దేశంలో మూడో విడత లాక్ డౌన్ మే 17వ తేదీ వరకు ఉన్న సంగతి తెలిసిందే. కానీ మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. మే చివరి వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. దీంతో ఫేక్ మేసేజ్ స్ప్రెడ్ కాగా.. ఆర్మీని మొహరించడం లేదు అని.. అది ఫేక్ న్యూస్ అని అధికారులు స్పష్టంచేశారు.

English summary
There is a claim circulating on WhatsApp that says that the entire city of Mumbai would be under a military lockdown. but this is fake news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X