'లోన్'కు న్యూడ్ ఫోటోలతో లింకు: పంపిస్తేనే పని.. షాక్ తిన్న అధికారులు..

Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఓవైపు అధిక వడ్డీలతో సామాన్యుడి నడ్డి విరుస్తూనే.. మరోవైపు వ్యక్తిగతంగాను వారిని టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసిన కాల్ మనీ ఉదంతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అప్పు సకాలంలో చెల్లించడం లేదని చాలామంది మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టినట్లు కాల్ మనీ ఉదంతంలో తేలిన సంగతి తెలిసిందే.

ఇలాంటి ఘటనే ఇప్పుడు మహారాష్ట్రలోను వెలుగుచూసింది. ఈజీ లోన్స్ పేరిట యూఎస్ కస్టమర్లకు గాలం వేస్తున్న ఈ కంపెనీ.. రుణం ఇవ్వడం కోసం ఆస్తుల పత్రాలతో పాటు నగ్న ఫోటోలు, నగ్న వీడియోలు తమ వద్ద పెట్టాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. ఠాణెలోని బీపీవో కంపెనీ రెకాన్‌ ఎంటర్‌ ప్రైజెస్ ఈ నిర్వాకానికి పాల్పడింది. ఇదో ఫేక్ కాల్ సెంటర్ అని పోలీసులు నిర్దారించారు.

Maharashtra

బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు కంపెనీ కార్యాలయంలో దాడులు చేశఆరు. ఇందులో భాగంగా పలు పత్రాలను స్వాధీనం చేసుకుని వారికి దిమ్మ తిరిగే షాక్ తగలింది. ష్యూరిటీ కింది ఆస్తులతో పాటు నగ్న చిత్రాలను వారు సేకరిస్తున్నట్లు గుర్తించారు. అప్పు అత్యవసరం కావడంతో చాలామంది మహిళలు తమ నగ్న చిత్రాలను కంపెనీకి ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, 1000 నుంచి 5000 డాలర్ల మధ్య వివిధ రకాల రుణాలిప్పించేందుకు గాను కంపెనీ ప్రతినిధులు 20 నుంచి 30 శాతం కమిషన్ తీసుకునేందుకు ముందే ఒప్పందం చేసుకుంటారు. ఆవిధంగా ఇటు ఆర్థికంగాను, వ్యక్తిగతంగాను కస్టమర్లను లూటీ చేస్తున్నారు. ఇందులో 25మంది పురుషులతో పాటు, ఒక మహిళ కూడా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.రెకాన్ కంపెనీ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A call center which had been duping thousands of US citizens in name of easy loans has been busted by the Thane crime branch in Ambernath near Mumbai during the intervening night of June 8 and 9. The raid started in the Anand Nagar MIDC area of Ambernath where a BPO named Rackon enterprises operated from an industrial building.
Please Wait while comments are loading...