వేరే వ్యక్తితో తన పరీక్ష: అడ్డంగా దొరికిన మంత్రి భార్య
న్యూఢిల్లీ: పరీక్ష రాయకుండా డిగ్రి పట్టా సంపాదించుకోవాలని సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి గారి సతీమణి అడ్డంగా దొరికినపోయిన సంఘటన చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చత్తీస్‌గఢ్ విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ సతీమణి శాంతి కశ్యప్ సుందర్ లాల్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ (ఇంగ్లీష్) ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
శాంతి కశ్యప్ తాను పరీక్షలు రాయకుండా, తన పరీక్ష రాయడానికి తన సోదరి కిరణ్ మౌర్యను పంపారు. ఈ ఉదయం 10 గంటలకు శాంతి హాల్ టికెట్ తీసుకుని కిరణ్ మౌర్య ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆమె పరీక్ష రాస్తుండగా, తోటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఇన్‌ఛార్జి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఇన్‌ఛార్జి హేమరావు ఖర్గేకు చెప్పడంతో జరిగిన విషయాన్ని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన పోలీసులు కిరణ్ మౌర్యను బయటకు పంపారు. ప్రస్తుతం ఈ విషయం చత్తీస్ గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది.
తన భార్య తరుపున పరీక్ష రాస్తూ వేరే వ్యక్తి పట్టుబడిన ఉదంతంపై ఆ రాష్ట్ర మంత్రి ఇంతవరకూ స్పందించక పోవడం విశేషం.












Click it and Unblock the Notifications