నకిలి సీబీఐ అధికారి అరెస్టు, 6 ఏళ్లుగా ఇదే మాట

బనస్కంత (గుజరాత్): తాను సీబీఐ అధికారిని అంటూ అందరిని నమ్మించి బురిడి కొట్టిస్తున్న యువకుడిని గుజరాత్ లోని బనస్కంత జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బనస్కంత జిల్లాలోని జదు గ్రామంలో నివాసం ఉంటున్న భరత్ ఠాకూర్ (25) అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు.

భరత్ ఠాకూర్ నిరుద్యోగి. అయితే ఇతను తన సొంత గ్రామంలో తాను ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నానని నమ్మించాడు. గత 2009వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇతను కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులకు ఇదే మాట చెబుతున్నాడు.

తమ బిడ్డ సీబీఐ అధికారి అయ్యాడని కుటుంబ సభ్యులు, మంచి దర్యాప్తు సంస్థలో పని చేస్తున్నాడని బంధువులు, గ్రామస్తులు మురిసిపోయారు. జదు గ్రామంలో, చుట్టు పక్కల ఉన్న గ్రామాలలో ఎలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టినా భరత్ ఠాకూర్ దగ్గర ప్రారంభించేవారు. అతనిని అందరు నెత్తిన పెట్టుకున్నారు.

 fake cbi officer arrested in gujarat

అయితే స్థానిక పోలీసులకు భరత్ ఠాకూర్ మీద అనుమానం వచ్చింది. భరత్ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. మీకు ఎందుకు నేను అన్ని విషయాలు చెప్పాలని భరత్ ఎదురు తిరిగాడు. అయితే పోలీసులు ఇంటిలో పరిశీలించగా భరత్ పేరుతో ఒక సీబీఐ ఐడి కార్డు బయటపడింది.

సీబీఐ లోగో ఉన్న ఆ ఐడికార్డు నకిలిది అని పోలీసులు గుర్తించారు. అదే విధంగా భరత్ ఇంటిలో పలు లెటర్ హెడ్ లు బయటపడ్డాయి. అన్ని నకిలీవి అని తెలుసుకున్న పోలీసులు భరత్ ఠాకూర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+