చాట్ జీపీటీ సాయంతో హైక్వాలిటీ నకిలీ నోట్లదందా.. అష్టాంగ యోగాగురువు సహా ఏడుగురు అరెస్ట్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం గణనీయంగా పెరిగిన క్రమంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిస్ యూజ్ చేస్తున్నవారు కూడా పెరిగిపోయారు. ముఖ్యంగా క్రిమినల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా అటువంటి సంఘటన నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక భారీ నకిలీ కరెన్సీ రాకెట్ ను చేదించటంతో వెలుగులోకి వచ్చింది.
నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠా అరెస్ట్
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 2.38 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏడుగురు నిందితులను, ఒక మహిళను అరెస్టు చేస్తారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పోలీసులు అహ్మదాబాద్‌లోని అమ్రైవాడిలో టొరెంట్ పవర్ సమీపంలో ఒక ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని వాహన తనిఖీలలో భాగంగా ఆపారు .

ఈ వాహనంలో రూ.2.10కోట్ల నకిలీ 500రూపాయల నోట్లు
ఈ వాహనంలో రూ.2.10కోట్ల నకిలీ 500రూపాయల నోట్లు లభించాయి. ఈ వ్యవహారంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో సూరత్‌లోని ఒక ఇంటిపై దాడి చేసి, రూ.28లక్షల నకిలీ నోట్లతో పాటు ప్రింటర్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, కటింగ్ మెషీన్‌లు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిలో అష్టాంగ యోగా గురువు ప్రదీప్ జొటంగియా, ముఖేష్ తుమ్మర్, అశోక్ ధంజి మావానీ, రమేష్ బాలర్, దివ్యేష్ రానా, భరత్ కకాడియా ఉన్నారు.
దర్యాప్తులో షాకింగ్ విషయాలు
సూరత్‌లోని కటార్‌గామ్‌కు చెందిన ఒక మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ముఖేష్ తుమ్మర్ ఈ రాకెట్‌కు నాయకుడని, గత నాలుగు నెలలుగా సూరత్‌లోని ఒక నివాస భవనంలో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నాడని తేలింది. చైనా నుంచి "RBI", "భారత్" గుర్తులున్న సెక్యూరిటీ-త్రెడ్ పేపర్‌ను ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకున్నట్టు చెప్పారు.
చాట్ జిపిటి ద్వారా రీసెర్చ్
దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం చాట్ జిపిటి ద్వారా రీసెర్చ్ చేసినట్టు చెప్పారు.నకిలీ నోట్లకు నిజమైన రూపాన్ని ఇవ్వడానికి ఫోటో-ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాధనాలని ఉపయోగించారు. ఇది వారి అధునాతన ముద్రణ పద్ధతులను స్పష్టం చేస్తుంది. అహ్మదాబాద్ డీసీపీ అజిత్ రాజియన్ ఈ ఆపరేషన్‌పై మాట్లాడుతూ, నకిలీ కరెన్సీ సరఫరా, దాని ముద్రణ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిందని తెలిపారు.
నకిలీ నోట్ల చలామణిలో అంతర్జాతీయ సంబంధాలు ఉండవచ్చని అంచనా
సాంకేతికత, అంతర్జాతీయ వనరులను ఉపయోగించి హై క్వాలిటీ నోట్లను తయారు చేసినట్టు, నోట్ల నాణ్యతను పెంచడానికి నిందితులు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ఆర్థిక విపత్తు తప్పింది అని ఆయన వివరించారు. ఈ కేసులో రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా, ఈ నకిలీ నోట్ల చలామణిలో అంతర్జాతీయ సంబంధాలు ఉండవచ్చని డీసీపీ అంచనా వేశారు. ఆ కోణంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నిందితులందరిపై డీసీబీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ముఠా ఇతర ఆర్థిక లావాదేవీలను దర్యాప్తు చేస్తున్నారు.
-
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!













Click it and Unblock the Notifications