ఫేక్ న్యూస్: ఆర్థిక సంవత్సరాన్ని రీసెట్ చేశారా? రిజర్వుబ్యాంకు ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపును పొడిగించిందని, ఆర్థిక సంవత్సరాన్ని కొత్తగా రీసెట్ చేసిందనే వార్తలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం.. ఈ అనుమానాలకు బలాన్ని కలిగించింది.
మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన నిర్మలా సీతారామన్.. ఆ ఊసే ఎత్తలేదు. ఆర్థిక సంవత్సరాన్ని రీసెట్ చేయడానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా వెల్లడించలేదు. దీనితో- అప్పటిదాకా వినిపించిన వార్తలన్నీ ఊహాజనితమైనవేనని తేలిపోయాయి. నిజానికి- ఏటేటా ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. మార్చి 31వ తేదీ వరకు మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా భావిస్తుంటారు.

Recommended Video
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. అంటే 2019-2020 ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరులోగా ముగుస్తుంది. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సర కాలాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తుందనే వార్తలు వినిపించాయి. ఇదివరకు రిజర్వుబ్యాంకు విడుదల చేసిన ఓ ప్రకటన కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగించింది. వాటన్నింటినీ కేంద్రం కొట్టి పారేసినట్టయింది. ఆర్థిక సంవత్సర ఆరంభం.. ముగింపుల్లో ఎలాంటి తేడా ఉండదని పేర్కొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications