Family: భార్య, ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపి ఐటీ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య, మ్యాటర్ ? !

చెన్నై: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. భర్త ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అతను దిగులుగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత అడిగినా అతను వాళ్లకు అసలు మ్యాటర్ చెప్పలేదని తెలిసింది. కొంతకాలంగా భార్యతో అతను గొడవపడుతున్నాడు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో పెద్దగా గొడవ చేశాడు. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన మహిళ ఆమె రూమ్ లో నిద్రపోయింది. అర్దరాత్రి దాటిన తరవాత భర్త అతని భార్య, ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేశాడు. భార్య, బిడ్డలను చంపేసిన అతను అక్కడే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 భార్య, పిల్లలతో హ్యాపీలైఫ్

భార్య, పిల్లలతో హ్యాపీలైఫ్

చెన్నై సిటీలోని పల్లవరంలోని పోజిచ్చలూరు ప్రాంతంలోని వెంకటేశ్వర్లు వీధిలో ప్రకాష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రకాష్ గాయిత్రీ (39) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా కాపురం చేసిన ప్రకాష్, గాయిత్రీ దంపతులకు నిత్యశ్రీ (11), హరిక్రిష్ణన్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 దిగులుగా ఉంటున్న భర్త

దిగులుగా ఉంటున్న భర్త

ప్రకాష్ చెన్నైలోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా ప్రకాష్ దిగులుగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత అడిగినా ప్రకాష్ మాత్రం వాళ్లకు అసలు మ్యాటర్ చెప్పలేదని తెలిసింది. ఇంట్లో భార్య గాయిత్రీ అడిగినా కూడా ప్రకాష్ అసలు విషయం చెప్పకుండా ఇంతకాలం సైలెంట్ గా ఉన్నాడని తెలిసింది.

 పిల్లలతో కలిసి నిద్రపోయిన భార్య

పిల్లలతో కలిసి నిద్రపోయిన భార్య

కొంతకాలంగా ప్రకాష్ చిన్నచిన్న విషయాలకు అతని భార్య గాయిత్రీతో గొడవపడుతున్నాడు. రాత్రి ఇంటికి వెళ్లిన ప్రకాష్ అతని భార్య గాయిత్రీతో పెద్దగా గొడవ చేశాడు. కొంతసేటి తరువాత ప్రకాష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి కూతురు నిత్యశ్రీ, కొడుకు హరిక్రిష్ణన్ తో కలిసి భోజనం చేసిన గాయిత్రీ ఆమె రూమ్ లో నిద్రపోయింది.

 రాత్రి ఇంట్లో భార్య, బిడ్డలను చంపేసి ఏం చేశాడంటే ?

రాత్రి ఇంట్లో భార్య, బిడ్డలను చంపేసి ఏం చేశాడంటే ?

రాత్రి ఇంటికి వెళ్లిన ప్రకాష్ ఓ రూమ్ లోకి వెళ్లాడు. అర్దరాత్రి దాటిన తరవాత ప్రకాష్ అతని భార్య గాయిత్రీతో పాటు కొడుకు హరిక్రిష్ణన్, కూతురు నిత్యశ్రీల గొంతులు కోసి చంపేశాడు. భార్య, బిడ్డలను చంపేసిన ప్రకాష్ అక్కడే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రకాష్ అప్పులు చేశాడని, రుణం ఇచ్చిన వాళ్లు ఎక్కువ ఒత్తిడి చెయ్యడంతో ఇంత దారుణానికి పాల్పడ్డాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రుణం ఇచ్చిన వాళ్లు ఎవరైనా ప్రకాష్ ను బెదిరించారా అని తెలుసుకోవడానికి ప్రకాష్ మొబైల్ పరిశీలిస్తున్నామని చెన్నై సిటీ పోలీసు కమీషనర్ రవి, పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+