వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Google Mapsను గుడ్డిగా నమ్మొద్దు బాస్...కేరళలో ఓ కుటుంబానికి ఏం జరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా టెక్నాలజీ.. గమ్య స్థానానికి వెళ్లేందుకు మొబైల్ ఓపెన్ చేయడం.. గూగుల్ మ్యాప్స్ తెరచి డెస్టినేషన్ టైప్ చేయడం జరుగుతుంది. అదీ రైట్ అంటే రైట్.. లెప్ట్ అంటే లెప్ట్ వెళ్లక తప్పని పరిస్థితి.. అయితే కొన్నిసార్లు తప్పిదాలు కూడా జరుగుతాయి. కేరళలో ఓ ఫ్యామిలీకి ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. వారు ఏకంగా కెనాల్‌లో పడిపోయారు. వెంటనే స్థానికులు స్పందించారు కాబట్టి సరిపోయింది.. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది.

 కారులో బయల్దేరిన ఫ్యామిలీ..

కారులో బయల్దేరిన ఫ్యామిలీ..

కేరళలో ఈ ఘటన జరిగింది. కుంబనాడ్ నుంచి ఈ ఫ్యామిలీ బయల్దేరింది. అందులో డాక్టర్ సోనియా, ఆమె మూడు నెలల కూతురు.. తల్లి సోసమ్మ, మరొక బంధువు ఉన్నారు. వారు వెళుతూ.. ఎవరినీ అడ్రస్ అడగడం ఎందుకు అనుకున్నారు. అలా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళుతున్నారు. ఇంతవరకు బానే ఉంది. కానీ గుడ్డిగా ముందడుగు వేశారు. మూల మలుపు కానీ.. ఇతర అంశాలు కానీ చూడటం లేదు.

 మూల మలుపు అయినా స్ట్రెయిట్

మూల మలుపు అయినా స్ట్రెయిట్


అలా వెళుతుండగా మూల మలుపు వచ్చింది. అయినప్పటికీ స్ట్రెట్‌గా కారును వెళ్లనిచ్చాడు. పరచల్ వద్దకు కారు వచ్చింది. ఇంకేముంది కారు నేరుగా కెనాల్‌లో పడింది. వెంటనే స్థానికులు రంగంలోకి దిగారు. కారును తాళ్లతో కట్టి పైకి తీశారు. అందులో ఉన్న నలుగురిని కాపాడారు. ఈ ఒక్క ఘటనే కాదు.. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.

 అమెరికాలో కూడా

అమెరికాలో కూడా


చాలా మంది తమ గమ్యస్థానాలను చేరుకోలేకపోయారు. అమెరికాలో గల మిన్నెపాలిస్, మిన్నెసోటలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. వారు కూడా మిస్సిసిపి నదిలో పడిపోయారు. ఇలాంటి ఘటనలు జరిగినందున.. గూగుల్ మ్యాప్స్ వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది.

English summary
family of four had rescued after their car plunged into canal in Kerala. driver had been following directions from Google Maps which led their vehicle straight into the water
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X