Family: కన్నబిడ్డలను చంపిన తల్లి, శవాలు బూడిద చేసిన అమ్మమ్మ, మేనమామ, శాడిస్టులు, ఏం జరిగింది?
ముంబాయి/ నాంధేడ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నపాపకు నాలుగు నెలల వయసు. సొంత పనుల మీద భర్త ఊరికి వెళ్లాడు. ఇంట్లో భార్య ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. కొన్ని రోజులుగా మహిళ పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నా కన్నతల్లి ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇదే సమయంలో పిల్లలు ఇద్దరు మాయం అయ్యారు.
స్థానికులకు అనుమానం వచ్చి భర్తకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త ఇంటికి చేరుకుని ఆరా తీశాడు. పోలీసుల విచారణలో కన్న బిడ్డలను తల్లి దారుణంగా చంపేసిందని వెలుగు చూసింది. తల్లి, సోదరుడి సహాయంతో కన్న బిడ్డల శవాలను కాల్చి బూడిద చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది. ఇద్దరు బిడ్డలను రెండు రోజుల్లో కన్న తల్లి ఎందుకు హత్య చేసింది ? అనే విషయం తెలుసుకున్న పిల్లల తండ్రితో పాటు స్థానికులు షాక్ అయ్యారు.

ఇద్దరు పిల్లల తల్లి
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని భోకేర్ తాలుకాలోని పాండుర్నా గ్రామంలో ధుర్పాదాబాయ్ (30) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం రాకేష్ అనే వ్యక్తిని ధుర్పదాబాయ్ పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్న ధుర్పదాబాయ్ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. ధుర్పదాబాయ్ దంపతులకు దత్త (2) అనే కుమారుడు, అనసూయ ( నాలుగు నెలల వయసు) అనే కూతురు ఉంది.

ఊరికి వెళ్లిన భర్త.....ఇంట్లో బిడ్డలు మాయం
సొంత పనుల మీద ధుర్పదాబాయ్ భర్త రాకేష్ నాలుగు రోజుల క్రితం ఊరికి వెళ్లాడు. ఇంట్లో ధుర్పదాబాయ్ ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. కొన్ని రోజులుగా మహిళ పిల్లలు ఇద్దరూ ఎక్కువగా ఏడుస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నా కన్నతల్లి ధుర్పదాబాయ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇదే సమయంలో ధుర్పదాబాయ్ కన్నబిడ్డలు ఇద్దరు మాయం అయ్యారు.

హడలిపోయిన భర్త
పిల్లలు ఇద్దరూ కనపడకపోవడం, ధుర్పదాబాయ్ మాత్రమే తిరుగుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించారు. ధుర్పదాబాయ్ దురుసగా సమాధనం ఇస్తూ పిల్లల గురించి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్థానికంగా నివాసం ఉంటున్న ఆమె బంధువులు ఆమె భర్త రాకేష్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త ఇంటికి చేరుకుని ఆరా తీశాడు.

బిడ్డలను చంపేసి కాల్చి బూడిద చేసిన తల్లి
పోలీసుల విచారణలో కన్న బిడ్డలను కన్నతల్లి ధుర్పదాబాయ్ దారుణంగా చంపేసిందని వెలుగు చూసింది. తల్లి కొండాబాయి రాజిమోద్, సోదరుడుడు మాధవ్ రాజిమోద్ సహాయంతో కన్న బిడ్డల శవాలను ధుర్పదాబాయ్ కాల్చి బూడిద చేసిందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

బిడ్డలు ఏడుస్తున్నారని చంపేసిన కన్నతల్లి
మే 31వ తేదీన నాలుగు నెలల చిన్నారి అనసూయ ఆకలితో ఎక్కువగా ఏడ్చిందని, ఆ సమయంలో సహనం కోల్పోయి బిడ్డ గొంతు నులిమి చంపేశానని ధుర్పదాబాయ్ పోలీసులకు చెప్పింది. జూన్ 1వ తేదీన రెండు సంవత్సరాల కొడుకు దత్తా కూడా ఆకలితో ఎక్కువగా ఏడ్చాడని, అతన్ని కూడా గొంతు నులిమి చంపేశానని, ఇద్దరి శవాలు ఊరి సమీపంలో కాల్చి బూడిద చేశామని ధుర్పదాబాయ్ పోలీసులకు చెప్పింది.

కసాయి ఫ్యామిలీ
బిడ్డలను చంపేసి వారి శవాలు బూడిద చెయ్యడానికి ధుర్పదాబాయ్ ఆమె తల్లి కొండాబాయ్, సోదరుడు మాధవ్ సహాయం తీసుకుందని పోలీసులు అన్నారు. ఇద్దరు పిల్లల హత్య కేసులో కన్నతల్లి ధుర్పదాబాయ్, ఆమె తల్లి కొండాబాయ్, సోదరుడు మాధవ్ ను అరెస్టు చేశామని నాంధేడ్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications