Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫణి తుఫాను ప్రభావం .. అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ .. పర్యాటకులు వదిలివెళ్లాలని ఆదేశం

Recommended Video

    Cyclone Phani : ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర ! అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ ! || Oneindia Telugu

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఫణి తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై పడింది. సూపర్ సైక్లోన్ గా మారిన ఫణి ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఫణి తుఫాన్ పై అప్రమత్తమైంది.

    పశ్చిమబెంగాల్ పై ఫణి తుఫాను ప్రభావం .. సముద్ర తీర ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆదేశం

    పశ్చిమబెంగాల్ పై ఫణి తుఫాను ప్రభావం .. సముద్ర తీర ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆదేశం

    సముద్రతీర ప్రాంతాలైన ఈస్ట్ మిడ్నాపూర్ , మరియు దక్షిణ 24 పరగణాల జిల్లాలో హెచ్చరికలు జారీ చేసింది . సముద్ర తీర ప్రాంతాల నుండి పర్యాటకులను వెళ్లిపోవాలని సూచించింది. మత్స్యకారులను సముద్రం లోనికి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పాఠశాలలను మూసివేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. అటు ఒడిస్సా రాష్ట్రం సైతం ఫణి తుఫానుపై అప్రమత్తం అయింది. తుఫాను సహాయక చర్యలకు రంగం సిద్ధం చేసింది.

    తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రోమ్మ్స్ ఏర్పాటు...పరిస్థితిని సమీక్షించనున్న సీఎం మమతా బెనర్జీ

    తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రోమ్మ్స్ ఏర్పాటు...పరిస్థితిని సమీక్షించనున్న సీఎం మమతా బెనర్జీ

    వెస్ట్ మిడ్నాపూర్, ఉత్తర పరగణాలలోని 24 జిల్లాలు , హౌరా, హుగ్లీ జిల్లాలు , ఝర్ గ్రామ్ మరియు సుందర్ బాన్స్ , కలకత్తా సమీప ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. దిగా , శంకర్ పూర్ , తాజ్ పూర్ , ఈస్ట్ మిడ్నాపూర్ లోని మందర్ మణి , భాక్కలి తీర ప్రాంతాల్లో ఉన్న టూరిస్ట్ లను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల అయినటువంటి జిల్లాలలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు మమతా బెనర్జీ. రానున్న రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్ పూర్ లో ఉండి పరిస్థితిని సమీక్షించనున్నారు.

    ఫణి తుఫాను నేపధ్యంలో అధికారులతో అత్యవసర సమావేశం .. రంగంలోకి దిగిన విపత్తు నివారణా శాఖ

    ఫణి తుఫాను నేపధ్యంలో అధికారులతో అత్యవసర సమావేశం .. రంగంలోకి దిగిన విపత్తు నివారణా శాఖ

    పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఫణి తుఫాను నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, విపత్తు నివారణ కు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో అపార నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.

    పలు రైళ్ళ రాకపోకలు రద్దు , కోల్ కత్తా పోర్ట్ లో షిప్పులు రద్దు , పలు విమానయాన సేవలు రద్దు

    పలు రైళ్ళ రాకపోకలు రద్దు , కోల్ కత్తా పోర్ట్ లో షిప్పులు రద్దు , పలు విమానయాన సేవలు రద్దు

    సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) ఆరు జంట రైళ్ళను పూరి నుండి కోల్ కత్తా వరకు రద్దు చేసింది. పూరీ నుండి తిరిగి వెళ్ళే ప్రయాణీకులకు మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది . పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సమన్వయంతో బస్సులు ఏర్పాటు చేస్తున్నారని, పూరీ నుంచి తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యాల కోసం టెర్మినల్స్ వద్ద ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తుఫాను బాధితులకు కావలసిన పునరావాస కేంద్రాలను వారికి కావలసిన మందులను, ఆహారపదార్థాలను ఎక్కడికక్కడ అందించాలని మమతా బెనర్జీ ఆదేశించారు. అటు అధికారులు తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారటంతో కలకత్తా పోర్ట్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలిసిన షిప్ లను క్యాన్సిల్ చేశారు .అంతేకాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని సర్వీసులను రద్దు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+