వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మా జవాన్లతో ఛాలెంజ్ వద్దు, కాశ్మీర్ పండిట్లపై ఎన్ని అరాచకాలు చేశారో'

శ్రీనగర్ ఉప ఎన్నికల సమయంలో ఓ ఆందోళనకారుడు సీఆర్పఎఫ్ జవాన్‌ను కొట్టిన ఘటనపై సినీ ప్రముఖులు స్పందించారు. జవాన్‌ను కొట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

|
Google Oneindia TeluguNews

మంబై: శ్రీనగర్ ఉప ఎన్నికల సమయంలో ఓ ఆందోళనకారుడు సీఆర్పఎఫ్ జవాన్‌ను కొట్టిన ఘటనపై సినీ ప్రముఖులు స్పందించారు. జవాన్‌ను కొట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఫర్హాన్ అక్తర్, కమల్ హాసన్, అనుపమ్ ఖేర్ వంటి వారు ఈ ఘటనను ఖండించారు.

శాంతంగా ఉన్నారు కదా అని జవాన్లతో ఛాలెంజ్‌ చేయకండని అనుపమ్ ఖేర్ హెచ్చరించారు. ఈ మేరకు అనుపమ్‌ ఖేర్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

'ఒకవేళ అతను కావాలనుకుంటే తనపై చేయి చేసుకున్నవాడిని చితకొట్టేవాడు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే.. కొందరు కాశ్మీర్‌ యువకులు పాల్పడే అరాచకాలను మానవ హక్కుల పేరిట కప్పిపుచ్చి వారిని తప్పుదోవ పట్టిస్తున్నార'ని అనుపమ్ ఖేర్ అన్నారు.

anupam kher

తనకు తెలిసి అలా చేసే వారిలో మన జవాన్ల గురించి ఇదే విధంగా ఆలోచించేవారుండరని తన నమ్మకం అని, కానీ ఇలా ఓ జవానును కొడుతున్న వీడియో వైరల్‌ అయినప్పుడు స్పందించడం ఎంతో ముఖ్యమన్నారు.

తనకు నాకు ఈ వీడియో చూసి కోపం వచ్చిందని, ఓ భారతీయుడిగా మాత్రమే కాదు, మానవత్వం ఉన్న మనిషిగా తనకు కోపం రావడం సహజమన్నారు.

మాటిమాటికీ కాశ్మీర్‌ ఘటనల గురించి మాట్లాడే కపట వ్యక్తుల గురించి అందరికీ తెలియాలన్నారు. ఆయుధాలున్న జవానులనే ఇలా కొడుతున్నారంటే ఇక 27 ఏళ్ల క్రితం ఎలాంటి ఆయుధాలు లేని అమాయక కాశ్మీరీ బ్రాహ్మణులపై, పండితులపై వారు ఇంకెన్ని అరాచకాలు చేసుంటారో ఊహించాలన్నారు.

కోపంతో తనకు మాటలు రావడం లేదన్నారు. ఏదేమైనా శాంతికి విలువిచ్చే మనిషిగా ఆ జవాను చేసిన పనిని సమర్ధిస్తున్నానని, కానీ మా జవానులతో మాత్రం ఛాలెంజ్‌ చేయకండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Bollywood celebrities such as Farhan Akhtar, Anupam Kher, Randeep Hooda, Kamal Hassan, have come out in support of the CRPF jawans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X