రెండేళ్లుగా నాపై గ్యాంగ్‌రేప్ చేస్తున్నారు: టీచర్ ఫిర్యాదు
న్యూఢిల్లీ/ఫరీదాబాద్: రెండేళ్లుగా ఓ ఉపాధ్యాయురాలిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి, అతని సోదరులు, మరో వ్యక్తి కలిసి రెండేళ్లుగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారని ఫరీదాబాద్‌కి చెందిన ఓ మహిళా టీచర్.. తన తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

కాగా, బాధితురాలి తల్లిదండ్రులు వెళ్లేసరికి ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీవ్రంగా గాయపడిన ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటే కానీ ఆమె వాంగ్మూలం తీసుకోవడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు.
ఆమె ఆరోగ్యం మెరుగుపడ్డాక ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఫరీదాబాద్ పోలీస్ పీఆర్ఓ కన్వర్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications