జైషే మహ్మద్ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది తెలుగు ఆఫీసరే..!

భారత్‌లో ఉగ్ర మూకల కుట్రలు బయటపడుతున్న తరుణంలో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ పేలుడులో సుమారు 12 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ ఘటనకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్ర కుట్రకు సంబంధం ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. జైషే మహ్మద్‌ - అన్సార్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్ర సంస్థలు ప్లాన్ చేసిన కుట్రలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మూడు వేల కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం..

కాగా ఫరీదాబాద్‌లో అరెస్టయిన అదీల్‌ అహ్మద్‌, ముజమ్మిల్‌ షకీల్‌, షాహిన్‌ల వద్ద నుంచి పోలీసులు అమోనియం నైట్రేట్‌, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 3,000 కిలోల పేలుడు పదార్థం, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, పత్రాలు, ఆయుధాలు లభించాయి. వీరిలో ఒకరు మహిళ కావడం గమనార్హం.

faridabad-terror-plot-by-jaish-e-mohammed-revealed-by-telugu-ips-officer-sandeep-chakravarthy

పోలీసుల దర్యాప్తులో ఈ మాడ్యూల్‌ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ దాడులు జరపాలని ప్రణాళిక వేసిందని తేలింది. ఫరీదాబాద్‌లో డాక్టర్లు దొరికిపోవడంతో ఆ కుట్ర ఫ్లాప్ అయింది. ఈ తరుణంలోనే తన సహచరులు డా. ముజామిల్ షకీల్, డా. ఆదీల్ అహ్మద్ రథర్ అరెస్టు కావడంతో.. పేలుడుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డా. ఉమర్ మహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

శ్రీనగర్‌లో వెలిసిన జైషే పోస్టర్లే క్లూ..

అయితే అక్టోబర్‌లో శ్రీనగర్‌లోని నౌగామ్‌లో జైషే మహ్మద్‌ పోస్టర్లు వెలగడం ఈ కేసులో కీలక మలుపు అయింది. ఆ పోస్టర్ల ద్వారా జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు మొదటి ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ముగ్గురు అనుమానితులను పట్టుకున్నారు. వారిని విచారించగా షోపియన్‌కు చెందిన మతాధికారి మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్‌ పేరు బయటపడింది.

ఇర్ఫాన్‌ అహ్మద్‌ ఫరీదాబాద్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో విస్తరించిన ఈ బహుళ రాష్ట్ర ఉగ్రవాద మాడ్యూల్‌కు ప్రధాన సూత్రధారిగా గుర్తించబడ్డాడు. అతడు జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌ ప్రాంతానికి చెందిన మతాధికారి. పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొంది, వైద్య విద్యార్థులను బ్రెయిన్‌వాష్‌ చేశాడు. విద్యార్థులకు జైషే వీడియోలు చూపించి, అఫ్గానిస్థాన్‌ ఉగ్రవాదులతో ఆన్‌లైన్‌లో సంప్రదింపులు జరిపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలోనే అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌ ల దగ్గర నుంచి పలుడుకు సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్‌ షాహిన్‌ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా దాడులకు రెండు సంవత్సరాలుగా సిద్ధమవుతున్నట్లు ఆమె ఒప్పుకుంది. ఆమె జమాత్‌ ఉల్‌ మొమినాత్‌ విభాగంలో ముఖ్య బాధ్యతలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ విభాగానికి జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వం వహిస్తోందని సమాచారం. ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌ బయటపడిన తరువాత, అధికారులు 'అల్‌ ఫలాహ్‌' యూనివర్సిటీపై దృష్టి సారించారు.

faridabad-terror-plot-by-jaish-e-mohammed-revealed-by-telugu-ips-officer-sandeep-chakravarthy

ఉగ్రకుట్రను బయటపెట్టింది తెలుగోడే..!

ఈ ఉగ్ర మాడ్యూల్‌ బట్టబయలు కావడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు IPS అధికారి సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన 2014 బ్యాచ్‌ ఆఫీసర్‌ అయిన ఆయన జమ్మూ కాశ్మీర్‌లో యాంటీ టెరర్‌ ఆపరేషన్లలో ప్రావీణ్యం సాధించి, ప్రెసిడెంట్‌ మెడల్‌ కూడా పొందారు. జమ్మూలో చైనీస్‌ పోస్టర్లు కనిపించిన తరువాత ఆయన సీసీటీవీ ఆధారంగా పాత కేసు నిందితులను గుర్తించి విచారణ జరిపారు. రెండు వారాల విచారణ తరువాతే ఈ ఉగ్ర మాడ్యూల్‌ పూర్తిగా బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన వ్యక్తి సందీప్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+