వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయ చట్టాలు వెనక్కి ఇందుకేనా..? పంజాబ్ పోరులో ఎవరి వ్యుహాం ఏంటీ..?

|
Google Oneindia TeluguNews

పంజాబ్ ఎన్నికలను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనే వాదనకు బలం చేకూరింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని మోడీ ప్రకటించడంతో.. ఎన్నికల కోసమే అంటూ అంతా చర్చ మొదలైంది. మోడీ ప్రకటన తర్వాత కూడా ఆందోళన చేస్తామని రైతు నేతలు ప్రకటించారు. కానీ ప్రస్తుతం అయితే రహదారులు మాత్రం వెల వెలబోతూనే ఉన్నాయి.

పంజాబ్‌లో మారిన పరిణామాలతో కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడారు. తానే సొంతంగా పార్టీని పెడతానని ప్రకటించారు. కానీ బీజేపీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. సో వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటామని చెప్పడం నిజంగా మంచి పరిణామమే అవుతుంది. సో ఇప్పుడు అమరీందర్ వారికి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.

Farm Laws Repealed: BJP’s Brave Political Bet For Punjab Assembly Elections

కాంగ్రెస్ పార్టీకి సిద్దు కొరకరానీ కొయ్యగా మారాడు. సీఎం పదవీపై కన్నేసిన.. అతనికి ఇవ్వలేదు. పీసీసీ చీఫ్ పదవీ ఇచ్చి.. బుజ్జగించింది. అంతకుముందు అమరీందర్‌తో సిద్దూకు గొడవలు ఉండేవి. దీంతో సిద్దూ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. పీసీసీ పదవీకి కూడా రాజీనామా చేశారు. ఢిల్లీ వేదికగా రాజకీయాలు జరిగాయి. ఇద్దరు రాజీనామాలు చేయడంతో.. పరిణామాలే మారిపోయాయి. కానీ సిద్దు వెనక్కి తగ్గగా.. అమరీందర్ మాత్రం పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరక.. సొంతంగా పార్టీ పెడతానని చెప్పారు.

Recommended Video

IPL 2022 Mega Auction : Punjab Kings కు KL Rahul గుడ్ బై! || Oneindia Telugu

ఇప్పుడు పంజాబ్ ఎన్నికల గురించి అంతా చర్చ జరుగుతుంది. విజయం కోసమే ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. వారిలో కాంగ్రెస్ ముందు వరసలో ఉండగా.. బీజేపీ కూడా ఛాన్స్ వదులుకోవడం లేదు. అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పింది. అమరీందర్ కూడా వెనక్కి తగ్గడం లేదు. వీరే కాక.. ఆప్ నుంచి కేజ్రీవాల్ కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. తమ పార్టీ మెజార్టీ సీట్లు సాధించడంపై ఫోకస్ చేశారు. అందుకే ఇటీవల అందరినీ కలుపుకొని వెళుతున్నారు. అందరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సో పంజాబ్ ఎన్నికల రేసు ఇలా ఉంది. వచ్చే ఏడాది జరిగే పోరులో ఎవరూ విజయం సాధిస్తారో చూడాలీ మరీ.

English summary
Narendra Modi cabinet has cleared the bill to repeal the farm laws in the upcoming session of Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X