బిల్లుల రద్దు ప్రకటన సరిపోదు-మాతో చర్చించాల్సిందే-రాకేష్ తికాయత్ వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్ని త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ తాజాగా ప్రకటించారు. దీనిపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఇన్నాళ్లూ దీనిపై పోరాడిన తమతో చర్చించకుండా వీటిని వెనక్కి తీసుకుంటామన్న ప్రకటన చేస్తే సరిపోతుందా అని రైతు సంఘాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఇప్పటికే వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గుతూ తాము తీసుకున్న నిర్ణయంపై బీజేపీ శ్రేణులతో పాటు కేంద్రానికి అనుకూలంగా ఉండే వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతుసంఘాలు ఎన్డీయే సర్కార్ ను మరింత ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రైతుల ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన చరిత్ర ఉన్న ఎన్డీయే సర్కార్ ను తుదికంటా టార్గెట్ చేసేందుకు రైతుసంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంతో తమతో చర్చించకుండా మీ నిర్ణయాలేంటని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ప్రశ్నిస్తున్నారు.

వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకుంటామని ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ రైతుల్ని ఇకనైనా ఇళ్లకు వెళ్లాలని కోరారు. దీనిపై తాజాగా మరోమారు స్పందించిన రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్... తమతో కేంద్రం చర్చలు జరపాలని, ఆ తర్వాతే ఇళ్లకు వెళ్తామని తేల్చిచెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా ఇవాళ లక్నోలో కిసాన్ మహాపంచాయత్‌ను నిర్వహించింది. ఇందులో బీకేయూ నేత రాకేష్ టికైత్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ, ఇంకా పరిష్కరించాల్సిన ఇతర సమస్యలు ఉన్నాయని అన్నారు.
శుక్రవారం చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని ప్రధాని మోదీ ప్రకటించకముందే మహాపంచాయత్‌ను ప్లాన్ చేశారు. ఆదివారం జరిగిన సమావేశంలో రైతులు మహాపంచాయతీని ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇతర విషయాలతోపాటు కనీస మద్దతు ధర (MSP)కి చట్టపరమైన హామీ కోసం తమ డిమాండ్‌ను ఒత్తిడి చేసేందుకు రైతులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.












Click it and Unblock the Notifications