మోడీకి ఉల్లిగడ్డల పార్సిల్ పంపిన మహారాష్ట్ర రైతులు.. ఎందుకంటే!!

మోడీకి మహారాష్ట్ర రైతులు ఆరుగాలం శ్రమించి తాము పండించిన ఉల్లిగడ్డల పార్సిల్ పంపారు.

ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసిన అన్నదాతలకు గిట్టుబాటు ధర దొరకటం లేదు. నాటు వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేవరకు, పంటకు వచ్చే చీడపీడలు నివారిస్తూ, కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటూ, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటూ వ్యవసాయం చేసి, పెళ్ళాం పిల్లలను పోషించుకుందామని భావించిన అన్నదాతలకు తీరా పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడం పిడుగుపాటుగా తయారైంది.

మహారాష్ట్ర ఉల్లి రైతుల కష్టాలు

మహారాష్ట్ర ఉల్లి రైతుల కష్టాలు


వ్యవసాయాన్ని నమ్ముకుని, అప్పులు చేసి పంట పైన పెట్టుబడి పెట్టి, తీరా లాభం వస్తుందని ఆశిస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాని తీరు రైతులను ఆవేదనకు గురిచేస్తుంది. ఇక ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఉల్లి సాగు చేస్తున్న రైతులు పండించిన పంటను పారేయలేక, గిట్టుబాటు ధర లేకపోవడంతో వాటిని అమ్మలేక నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో రైతులు తమ పరిస్థితి ప్రధాని నరేంద్ర మోడీకి తెలియాలని భావించారు.

ఉల్లి రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి

ఉల్లి రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి

ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి ధరలు కేవలం రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. దేశంలో ఉపయోగించే ఉల్లిలో ఎక్కువశాతం మహారాష్ట్రలో పండిస్తారు. అయితే ఇక్కడ రైతులు పండించిన ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర పలకకపోవడంతో రైతులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు నరకం చూస్తున్నారు.

ఉల్లిగడ్డలను ప్రధాని మోడీకి పార్సిల్ పంపిన రైతులు

ఉల్లిగడ్డలను ప్రధాని మోడీకి పార్సిల్ పంపిన రైతులు

ఈ క్రమంలోనే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి మహారాష్ట్ర కు చెందిన కొందరు రైతులు ఉల్లిగడ్డలను పార్సిల్ గా పంపారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు తీవ్రంగా పతనం కావడంతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు.

 కేంద్రం ఎగుమతులపై నిషేధం ఎత్తివెయ్యాలని రైతుల డిమాండ్

కేంద్రం ఎగుమతులపై నిషేధం ఎత్తివెయ్యాలని రైతుల డిమాండ్

పండిన పంట అమ్ముకుందామంటే ఇక్కడ గిట్టుబాటు ధర లేదని, కనీసం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అయినా తమకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న రైతులు కేంద్రం విధించిన నిషేధాన్ని సత్వరం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి ఉల్లిగడ్డల పార్సిల్ పంపించి తమ గోడు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. తమ నిరసన ఈ చర్యతో వ్యక్తం చేశారు. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఉల్లి రైతుల కష్టాలను చూసి ఏ విధంగా స్పందిస్తారు. ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+